+91 99635 77856

చెల్పూర్ హనుమాన్ సాక్షిగా ప్రమాణానికి సిద్ధమా

-పొన్నం పై ఆరోపణలు చేస్తే సూర్యుడి పై ఉమ్మేసినట్లు…
-కౌశిక్ రెడ్డికి ప్రణవ్ సవాల్…
-పబ్లిసిటీ కోసమే మంత్రిపై కౌశిక్ రెడ్డి ఆరోపణలు…
-ఆరోపణలు చేయడం కాదు ఆధారాలుంటే తీసుకురా…
-గైలెన్స్ ప్రకారమే నడుచుకుంటున్నామని ఎన్టీపీసీ. స్పష్టం చేసింది…
-కాంగ్రెస్ ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తాం…
-మొన్న రెడ్ బుక్, నిన్న బ్లాక్ బుక్, రేపు పింక్ బుక్ పెట్టుకో…
-కౌశిక్ రెడ్డి డబ్బులు వసూలు చేసినట్లు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి..
హుజురాబాద్ /జూన్ 24(మా అక్షరం): బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉద్యోగాల పేరా, ఇసుక మాఫియా, రైస్ మిల్లర్ల వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారని, దానికి సంబంధించిన పూర్తి ఆధారాలతో మంగళవారం ఉదయం 11 గంటలకు హుజురాబాద్ నియోజకవర్గం లోని చెల్పూర్ ఆంజనేయస్వామి ఆలయం వద్దకు వస్తున్నామని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా డబ్బులు తీసుకోలేదని వచ్చి ప్రమాణం చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఓడితల ప్రణవ్ సవాల్ విసిరారు.సోమవారం పట్టణం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కౌశిక్ రెడ్డి కి నియోజకవర్గం లో పబ్లిసిటీ కోసమే మంత్రి పొన్నం ప్రభాకర్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఫ్లైయాష్ స్కాంలో గతంలోనే కౌశిక్ రెడ్డికి సమాధానం చెప్పామని,ఇప్పటికైనా ఆధారాలు ఉంటే తీసుకొని రావాలని ఆయన డిమాండ్ చేశారు.ఫ్లైయాష్ రవాణాలో స్కామ్ జరిగి ఉంటే ఆధారాలు మీడియా ముందుకు తీసుకురావాలి తప్పా ఆధారాలు లేకుండా నిందలు వేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పొన్నం ప్రభాకర్ ఉద్యమ నాయకుడని కౌశిక్ రెడ్డి ఉద్యమ ద్రోహి అని అన్నారు. ఫ్లైయాష్ విషయంలో రోడ్డు హైవే అథారిటీ వాళ్లు టెండర్ చేసి మరి రవాణా కొనసాగిస్తున్నారని అన్నారు. నిజంగా ఓవర్ లోడ్ తో వెళితే ఎన్టీపీసీ వద్దకు వెళ్లి అధికారులను నిలదీయాలి తప్పా ఏ సంబంధం లేని మంత్రిపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పిన అబద్ధమే అవుతుంది తప్ప నిజం కాదన్నారు. కౌశిక్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఎన్ని విమర్శలు చేసిన ఆకాశం మీద ఉమ్మినట్టే అవుతుందన్నారు. ఫ్లైయాష్ విషయంలో ఎన్ టి పి సి కూడా పూర్తి ఆధారాలు ఇచ్చిందని, ప్లైయాష్ తరలింపు కూడా గైడ్లైన్స్ ప్రకారమే నడుస్తుందని వివరణ ఇచ్చారన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రభుత్వ అధికారులను బ్లాక్ బుక్ ఉందని బెదిరిస్తున్నారని, మొన్నటిదాకా రేట్ బుక్ అన్నారని ఇప్పుడు బ్లాక్ బుక్ అంటున్నారని ఇక మీద పింక్ బుక్కు కూడా దగ్గర పెట్టుకోమని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ మా ఎమ్మెల్యేల చిట్టా కూడా ఉందని భవిష్యత్తులో వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతి చిట్టా ఏమైనా తెలిస్తే కౌశిక్ రెడ్డి పింక్ బుక్కులో రాసుకొని ఇస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చి చర్యలకు ఆదేశించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నిటిని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నామని ఇచ్చిన హామీలన్నీ కచ్చితంగా నెరవేర్చి తీర్చమని ధీమా వ్యక్తం చేశారు. అందులో భాగంగా ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణంతో పాటు గ్యాస్ సబ్సిడీ ఉచిత కరెంటును అందిస్తున్నామని అన్నారు. రైతులకు మాట ఇచ్చిన ప్రకారం రెండు లక్షల రుణమాఫీ అతి త్వరలోనే చేస్తున్నామని రుణమాఫీ ఒక చరిత్ర అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పీసీసీ మెంబర్ పత్తి కృష్ణారెడ్డి, సొల్లు బాబు, పూదరి రేణుక శివ, వేముల పుష్పలత, కొల్లిపాక శంకర్, అఫ్సర్, తవుటం రవీందర్,కొల్లూరి కిరణ్, పుల్లూరు సదానందం, గుడెపు సారంగాపాణి, సాహెబ్ హుసేన్,సుశీల,రాధ,లావణ్య,దేశిని ఐలయ్య,తో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !