-ఆసుపత్రిలో డెలివరీల సంఖ్య పెంచాలి …
-ప్రతి నెల ఒకసారి ఆసుపత్రి తనిఖీ చేస్తా…
-ఆసుపత్రికి స్టాప్ సమయానికి రావాలి…
-హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి…
హుజురాబాద్/ జూలై 13(మా అక్షరం): ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని, ఆసుపత్రిలో డెలివరీల సంఖ్య పెంచాలని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శనివారం
కమలాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించాలని ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రులకు పెద్దపీట వేశారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయిన ఆడబిడ్డకు మగ బిడ్డ పుడితే 12000 ఆడబిడ్డ పుడితే 13000 తో పాటు కెసిఆర్ కిట్టు ను ఇవ్వడం జరిగిందని, కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇవ్వటం లేదని వాపోయారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే నిరుపేదలకు రోగులకు మెరుగైన వైద్యంతోపాటు ప్రభుత్వ ఆసుపత్రి పై నమ్మకం కలిగేలా వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతినెల 15 నుండి 20 డెలివరీ అయ్యేలా చూడాలని డాక్టర్స్ ని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిలో గైకాలజిస్ట్ ఉన్నాడని గ్రామాల్లో ప్రజలకు తెలిసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రి పై అపనమ్మకం పోవాలంటే డాక్టర్లు తో పాటు ఆసుపత్రి స్టాప్ సమయానికి రావాలని లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి నెల ఒకసారి అకస్మతిగా తనిఖీ చేయడం జరుగుతుందని వారికి తెలియజేశారు. తనిఖీకి వచ్చినప్పుడు సమయానికి రాని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కువ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేది నిరుపేద కుటుంబాలకు చెందిన వారు కాబట్టి వచ్చిన రోగులకు మెరుగైన వైద్యం అందించి వారికి అన్ని సౌకర్యాలు కల్పించి వారి నమ్మకం కలిగించాలని కోరారు.డాక్టర్లు కు ఆసుపత్రికి తన సహాయ సహకారాలు తన కృషి ఉంటుందని తెలియజేశారు. రాజకీయాలకతీతంగా నిరుపేదలకు వైద్యం అందించే విషయంలో రాజీ పడేది లేదని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. నేరుగా ఆసుపత్రిలో ఉన్న ప్రతి ఒక పేషంట్ వద్దకు వెళ్లి వైద్యం అందుతుందా లేదా అని వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్య ఉంటే తమకు తెలియజేయాలని వారికి సూచించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్లు స్టాప్ పాల్గొన్నారు.











