+91 99635 77856

అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతి అయిన పండ్ల బండ్లు.. భారీగా ఆస్తి నష్టం..

హుజురాబాద్/జులై 16(మా అక్షరం): హుజురాబాద్ పట్టణం నడి ఒడ్డున ఉన్న అంబేద్కర్ చౌరస్తా ఎదురుగా గల పాపారావు బొందలో చిరు వ్యాపారాలు చేసుకునే పండ్ల బండ్లకు సోమవారం అర్ధరాత్రి నిప్పండుకుని కాళీ బూడిదయ్యాయి. అయితే ఒక దిక్కు వానలు కురుస్తుండగానే పండ్ల బండ్లకు పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లేక అగ్నిప్రమాదం జరిగిందా? లేదా ఎవరైనా కావాలని పండ్ల బండ్లకు నిప్పంటించారా! తెలియదు కానీ ఒకేసారి అన్ని పండ్ల బండ్లకు మంటలు చేలరేగి పూర్తిస్థాయిలో ఖాళీ బూడిద కావడం పట్టణంలో సంచలనం కలిగించింది. నిత్యం ఉదయం నుండి రాత్రి వరకు పండ్లు అమ్ముకుని వచ్చిన డబ్బులను అక్కడే దాచుకునే చిరు వ్యాపారుల పండ్లు నగదు పెద్ద మొత్తంలో దగ్ధమైనట్లుగా తెలుస్తుంది. ఈ అగ్ని ప్రమాదంలో భారీగానే ఆస్తి నష్టం జరిగి ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు. ఏదిఏమైనాప్పటికీ వర్షం పడుతుండగానే నిప్పురవ్వలు చెలరేగి పెద్ద ఎత్తున మంటలు లేవడం పలువురిని ఆలోచింపజేస్తుంది. స్థానిక ఫైర్ ఇంజన్, స్థానిక యువకులు మంటలు ఆర్పినప్పటికీ బండ్లు మొత్తం ఖాళీ బూడిద అయ్యాయి. పలువురు యువకులు స్వచ్ఛందంగా మంటలు ఆర్పేందుకు కృషి చేశారు. ఒక దిక్కు వర్షం పడుతుండగానే పెద్ద ఎత్తున మంటలు చిలరేగడం పలువురిని ఆందోళనకు గురిచేస్తుంది.

అగ్ని ప్రమాదంపై చిరు పండ్ల వ్యాపారులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్.
హుజురాబాద్ పట్టణ నడి ఒడ్డున ఉన్న అంబేద్కర్ చౌరస్తా ఎదురుగా గల పాపారావు బొందలో చిరు వ్యాపారాలు చేసుకునే పండ్ల బండ్ల తడకల షెడ్లకు సోమవారం రాత్రి ప్రమాదవశాత్తు నిప్పండుకుని కాళీ బూడిద కావడంతో చిరు వ్యాపారులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్. ప్రమాద జరిగిన సంఘటనపై పోలీసు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంగళవారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకొని బాధిత చిరు పండ్ల వ్యాపారులను కలువనున్నారు..

అగ్ని ప్రమాదంపై చిరు పండ్ల వ్యాపారులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ప్రముఖ సామాజికవేత్త సబ్బని వెంకట్..

హుజరాబాద్ పట్టణంలోని, అంబేద్కర్ కూడలి వద్ద సోమవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో చిరు వ్యాపారులైన పండ్ల బండ్ల దుకాణ దారులకు సంబందించిన తోపుడు బండ్లు, ఇతర సామాగ్రి పూర్తిగా దగ్ధం అయినట్లు తెలిసిన వెంటనే హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ సామాజిక వేత్త మరియు Genpact వైస్ ప్రెసిడెంట్” సబ్బని వెంకట్ ” స్పందించి,తన సానుభూతిని తెలియచేసారు. తక్షణం వారి బాధలో ఒక భాగమై బాధితులకు అండగా నిలవాలని నిర్ణయించుకుని ఒక్కొక్కరికి 5,000/- చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. సమయపాలన వల్ల రాలేకపోతున్నాని బాధను వ్యక్తపరుస్తూ, ఈ వారంలో 18 వ తేదీన స్వయంగా వచ్చి బాధితులను కలుస్తాను అని ఒక ప్రకటన విడుదల చేశారు.

 

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !