+91 99635 77856

ఆధారాలుంటే కేసులు పెట్టండి ..

-తిప్పారపు సంపత్ పై కుట్రలు చేయడం సరికాదు..

-రిటైర్డ్ సిఐ దాసరి భూమయ్య…

హుజురాబాద్/ జూలై 24(మా అక్షరం):
నాగార్జున డైరీ  యాజమాన్యం యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు తిప్పారపు సంపత్ పై సోషల్ మీడియాలో చేస్తున్న ఆరోపణలు మానుకోవాలని, ఆధారాలుంటే కేసులు పెట్టాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసరి భూమయ్య అన్నారు. బుధవారం హుజరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… నాగార్జున డైరీ పాల ఉత్పత్తులపై కొన్ని అనుమానాలు ఉన్నాయని అధికారులకు వినతి పత్రం ఇచ్చింది నిజమేనని, సంపత్ ఎక్కడ కూడా పైసలు డిమాండ్ చేసింది లేదన్నారు. ఇటీవల నాగార్జున డైరీ యాజమాన్యంతో పాటు సంపత్ కూడా తన వద్దకు వచ్చారని డైరీ పాల తయారీ విషయంలో ఇరువురి మధ్య వాద  ప్రతివాదనలు జరిగాయి తప్పా డబ్బులు ఇవ్వాలనే డిమాండ్ రాలేదన్నారు. గతంలో నాగార్జున డైరీ అధినేత పుల్లూరి ప్రభాకర్ రావు సంపత్ పై అక్రమ కేసులు పెట్టారని తన సమక్షంలో ఆవేదనకు లోనయ్యారని అన్నారు. 11 మందిపై కేసులు పెట్టడంతో తమలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు కోల్పోయారని చెప్పుకొచ్చారని అన్నారు. డైరీలో పాల ఉత్పత్తులు సక్రమంగా జరగడం లేదని పిల్లలు తాగుతారు కనుక తయారీ విషయంలోనే మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయని సంపత్ ప్రశ్నించారని అన్నారు. ఇరువురి మధ్యలో ఎలాంటి డబ్బుల ప్రసక్తి రాలేదని, సంపత్ అనుచరుడి పేరుతో నాగార్జున డైరీ యాజమాన్యాన్ని బెదిరించిన వారిపై కేసులు పెట్టారన్నారు. అనవసరంగా కాంగ్రెస్ పార్టీని, రాష్ట్ర నాయకుని ఆధారాలు లేకుండా నిందలు వేయరాదన్నారు. నిజానిజాలు పూర్తిగా తెలిసిన తర్వాత తప్పు ఉంటే పార్టీ చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ  సమావేశంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు రుద్రారం రామచంద్రం, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు తునికి వసంత్,  దళిత సంఘం నాయకులు రవి, రవితేజ, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !