+91 99635 77856

గోరింటాకు సంబరాలు..

Kudikala Sai Editor
maaksharamnews.in

గోరింటాకు సంబరాలు..

హుజురాబాద్/జులై 26(మా అక్షరం): పట్టణంలోని సిద్ధార్థ నగర్ కాలనిలో గోరింటాకు వేడుకను శుక్రవారం మహిళలు ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళలు అతి పవిత్రంగా భావించే ఆషాఢమసాన్నీ పురస్కరించుకొని కాలనిలోని మహిళలందరు ఒక్కచోట చేరి ఒకరికొకరు తమ చేతులకి గోరింటాకుతో అందంగా అలంకరించుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు సతీమణి సాగి వనజ మాట్లాడుతూ..పురాణాల ప్రకారం గోరింటాకుకు గౌరి దేవికి ఎంతో అవినాభావ సంబంధం ఉందని అన్నారు. నాటి నుండి నేటి వరకు మహిళలు ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారని,గోరింటాకు కేవలం మహిళలకు అందానికే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకురుస్తుందని, ప్రత్యేకించి మహిళల సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తారని, భావితరాలకి ఈ సాంప్రదాయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వనజ అన్నారు.ఈ కార్యక్రమంలో మాడ సమతరెడ్డి, పెద్ది ప్రసూనారెడ్డి, సాగి ప్రియాంక, మాడ భాగ్యలక్ష్మి, కేతిరి ప్రసన్నరెడ్డి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !