-జనరంజక బడ్జెట్ పై ప్రతిపక్షాలు విమర్శ చేయడం సిగ్గు చేటు..
-వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ సర్కార్..
-టీపీసీసీ ఎస్సీ సెల్ మాజీ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్…
హుజురాబాద్/జూలై 26(మా అక్షరం): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం ప్రజామోద బడ్జెట్ ను ప్రకటించిందనీ, రెండు లక్షల 92 వేల 159 కోట్లతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ దేశానికి దిక్సూచిగా నిలుస్తుందనీ టిపిసిసి ఎస్సీ సెల్ మాజీ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ…రైతును రాజు చేయడమే లక్ష్యంగా వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన మాట మేరకు మాట తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి బడ్జెట్లో అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. బడ్జెట్లో సింహభాగం వ్యవసాయ రంగానికి కేటాయించడం అభినందనీయమని, వ్యవసాయ రంగానికి రూ.72 ,659 కోట్లు కేటాయించడం రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. అంతేకాక చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అన్ని రంగాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి రంగానికి పెద్ద పీట వేస్తూ బడ్జెట్ లో నిధులు కేటాయించడం చారిత్రక నిర్ణయం అని పేర్కొన్నారు. పేద మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయడం అభినందనీయం అన్నారు. గత ప్రభుత్వ హయాంలో బడ్జెట్ అంటే అంకెల గారడి చేసి చూపించిందని, అప్పుల కుప్పగా అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం మార్చి దోచుకు తిన్నారన్నారు. 2023 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో ఆరు లక్షల 70 ఒకవేల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసి ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ పై విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. 8 మంది ఎంపీలు అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఇచ్చింది గుండు సున్న అని,కేంద్ర మంత్రులు బిజెపి ఎంపీలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా బడ్జెట్ పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తక్షణమే ఆత్మ విమర్శ చేసుకుని తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంపై కొట్లాడాలని దొంత రమేష్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో చందమల్ల బాబు, బత్తిని రవీందర్ గౌడ్, దుబాసి బాబు, ముక్క రమేష్, ముక్క రవితేజ తదితరులు పాల్గొన్నారు.











