+91 99635 77856

ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు..

Kudikala Sai Editor
maaksharamnews.in

ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు..

హుజురాబాద్/ ఆగస్టు07(మా అక్షరం): మండలంలోని శాలపల్లి గ్రామంలో పద్మశాలి భక్త మార్కండేయ సేవా సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు జడల చిరంజీవి మాట్లాడుతూ... పోగును వస్త్రంగా మలిచి మనిషి మానాన్ని కాపాడే కుల వృత్తి చేనేత వృత్తి ...ఆ వృత్తిని కాపాడాలని అన్నారు. పోగు పోగు నేసి బట్ట గా తయారు చేసే నేతన్ననే జీవనోపాధి కోల్పోవడం వల్ల ఆపోగే నేతన్నలకు ఉరితాడుగా మలుచుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల బీమా వర్తింపచేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాలను ప్రభుత్వం అన్ని రకాల ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడల అశోక్ కుమార్, ఆడెపు పోషములు,జడల ఐలయ్య,కొక్కుల శంకరయ్య,జడల పోశయ్య,ఎనుగందుల తిరుపతి,జడల సుధాకర్,వేముల భూపతి,ఆడెపు సమ్మయ్య, మెరుగు రాజు,దుస్స శ్రీనివాస్, కొక్కుల శ్రీనివాస్,ఎనగందుల సమ్మయ్య, మెరుగు నగేష్, గుత్తికొండ అంజయ్య,దుస్స సతీష్, వేముల రమేష్ ,కార్యవర్గ మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

హుజురాబాద్/ ఆగస్టు07(మా అక్షరం): మండలంలోని శాలపల్లి గ్రామంలో పద్మశాలి భక్త మార్కండేయ సేవా సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు జడల చిరంజీవి మాట్లాడుతూ… పోగును వస్త్రంగా మలిచి మనిషి మానాన్ని కాపాడే కుల వృత్తి చేనేత వృత్తి …ఆ వృత్తిని కాపాడాలని అన్నారు. పోగు పోగు నేసి బట్ట గా తయారు చేసే నేతన్ననే జీవనోపాధి కోల్పోవడం వల్ల ఆపోగే నేతన్నలకు ఉరితాడుగా మలుచుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల బీమా వర్తింపచేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాలను ప్రభుత్వం అన్ని రకాల ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడల అశోక్ కుమార్, ఆడెపు పోషములు,జడల ఐలయ్య,కొక్కుల శంకరయ్య,జడల పోశయ్య,ఎనుగందుల తిరుపతి,జడల సుధాకర్,వేముల భూపతి,ఆడెపు సమ్మయ్య, మెరుగు రాజు,దుస్స శ్రీనివాస్, కొక్కుల శ్రీనివాస్,ఎనగందుల సమ్మయ్య, మెరుగు నగేష్, గుత్తికొండ అంజయ్య,దుస్స సతీష్, వేముల రమేష్ ,కార్యవర్గ మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !