+91 99635 77856

వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

Kudikala Sai Editor
maaksharamnews.in

వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

 

కరీంనగర్,తిమ్మాపూర్/సెప్టెంబర్  26(మాఅక్షరం):తిమ్మాపూర్ మండలంలోని మన్నెంపల్లి గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 129వ జయంతి పురస్కరించుకొని గురువారం ఐలమ్మ విగ్రహానికి మాజీ ప్రజాప్రతినిధులు రజక సంఘ కుల బంధువులు పూలమాలలు వేసి నివాళులర్పించి స్వీట్స్ పంపిణీ చేశారు. అనంతరం రజక సంఘ అధ్యక్షులు పోతుగంటి సంపత్ మాట్లాడుతూ ...నిజాం నిరంకుశ పాలనలో మగ్గుతున్న తెలంగాణలో తొలి భూ పోరాటానికి, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన ధెైర్యశాలి చాకలి ఐలమ్మ అని అన్నారు.తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయన్నారు. ఆమె తెగువ, పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయని పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని పునికి పుచ్చుకుని ప్రతీ ఒక్కరూ ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రవి సానగొండ సది, కనుకయ్య, నరసింహస్వామి, సమ్మయ్య, లచ్చయ్య, వెంకటమల్లు, కమలాకర్, అనిల్, శ్రీకాంత్, హరికృష్ణ, నాంపల్లి పరుశరాములు, రజక కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

 

కరీంనగర్,తిమ్మాపూర్/సెప్టెంబర్  26(మాఅక్షరం):తిమ్మాపూర్ మండలంలోని మన్నెంపల్లి గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 129వ జయంతి పురస్కరించుకొని గురువారం ఐలమ్మ విగ్రహానికి మాజీ ప్రజాప్రతినిధులు రజక సంఘ కుల బంధువులు పూలమాలలు వేసి నివాళులర్పించి స్వీట్స్ పంపిణీ చేశారు. అనంతరం రజక సంఘ అధ్యక్షులు పోతుగంటి సంపత్ మాట్లాడుతూ …నిజాం నిరంకుశ పాలనలో మగ్గుతున్న తెలంగాణలో తొలి భూ పోరాటానికి, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన ధెైర్యశాలి చాకలి ఐలమ్మ అని అన్నారు.తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయన్నారు. ఆమె తెగువ, పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయని పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని పునికి పుచ్చుకుని ప్రతీ ఒక్కరూ ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రవి సానగొండ సది, కనుకయ్య, నరసింహస్వామి, సమ్మయ్య, లచ్చయ్య, వెంకటమల్లు, కమలాకర్, అనిల్, శ్రీకాంత్, హరికృష్ణ, నాంపల్లి పరుశరాములు, రజక కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !