+91 99635 77856

పరిమళించిన మానవత్వం….

-పేద కుటుంబం పై పోలీసుల పెద్ద మనసు..
హుజురాబాద్/ సెప్టెంబర్26(మా అక్షరం): సమాజంలో విలువలు మానవత్వం కోల్పోతున్న సమయంలో ఒక పేద కుటుంబంలో ఆ కుటుంబ పోషకుడు మరణిస్తే మేమున్నామంటూ హుజురాబాద్ పోలీసుల పెద్దమనస్సు చూపడంతో ప్రజలంతా శభాష్ పోలీసు అంటున్నారు.వివరాల్లోకెళ్తే హుజురాబాద్ మండలంలోని ధర్మరాజు పల్లి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకున్న విషయం విధితమే.ధర్మరాజు పల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన కోట లక్ష్మణ్ మంగళవారం అనారోగ్యంతో మరణిస్తే గ్రామస్తులంతా కలిసి దహన సంస్కారాలు నిర్వహించారు. హుజురాబాద్ పోలీసులు కూడా మేమున్నామంటూ ఆ కుటుంబానికి అండగా నిలిచారు.గురువారం ఏసీపీ ఆధ్వర్యంలో లక్ష్మణ్ కుటుంబానికి నిత్యవసర వస్తువులతో పాటు ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ జీ మాట్లాడుతూ… లక్ష్మణ్ ఘటన తమ ను చాలా బాధకు గురి చేసిందని అన్నారు.లక్ష్మణ్ కుటుంబానికి అండగా ఉంటామని వారి పిల్లల చదువుకు పోలీసుల తరఫున సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ టౌన్ సిఐ తిరుమల్ గౌడ్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !