+91 99635 77856

సుఖ వ్యాధులతో బాధపడే ప్రతి ఒక్కరు హెచ్ ఐ వి స్క్రీనింగ్ చేపించుకోవాలి…

-జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ సంస్థ డీపీఎం సురేందర్ రెడ్డి…

హుజురాబాద్/సెప్టెంబర్ 26(మా అక్షరం): సుఖ వ్యాధులతో బాధపడే ప్రతి ఒక్కరు హెచ్ ఐ వి స్క్రీనింగ్ చేపించుకోవాలనీ జిల్లా ఎయిడ్స్ నివారణ,నియంత్రణ సంస్థ డీపీఎం సురేందర్ రెడ్డి అన్నారు.గురువారం స్థానిక ఏరియా హాస్పిటల్ లోని ఐసిటీసీ ఆధ్వర్యం లో హెచ్ ఐ వి,ఎయిడ్స్, సుఖవ్యాధుల పై ర్యాలీ నిర్వహించారు.ఏరియా హాస్పిటల్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు నర్సింగ్, ల్యాబ్ స్టూడెంట్స్, విద్యార్థులతో ఎయిడ్స్ నివారణ పై నినాదాలు చేస్తూ, పాటల రూపంలో అవగాహన కల్పించారు. కరపత్రాలు, ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సంద్భర్బంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ…హెచ్ ఐ వి తో బాధ పడే ప్రతి ఒక్కరూ విధిగా ఏ ఆర్ టి మందులు వాడాలని కోరారు. హుజూరాబాద్ ఏరియా హాస్పిటల్ లో ఏ ఆర్ టి మందులు అందుబాటు లో ఉన్నాయన్నారు. హెచ్ ఐ వి తో జీవిస్తున్న వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఏ ఆర్ టి మందులు వాడుతూ పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా జీవిత కాలం జీవించవచ్చన్నారు. హెచ్ ఐ వి గురించి సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 ద్వారా సంప్రదించవచ్చునని తెలిపారు. కార్యక్రమం లో ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజేందర్ రెడ్డి, ఆర్ ఎం ఓ సుధాకర్ రావు,డాక్టర్ నారాయణ రెడ్డి, జిల్లా ఐ సి టి సి సూపర్వైజర్ పి ఆర్ శ్రీనివాస్,ఐ సి టి ఎస్ కౌన్సిలర్ బి.సుజాత,ల్యాబ్ టెక్నీషియన్ జీ.ప్రశాంత్,ఎస్ టి ఎస్లు దేవేందర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి,సులోచన,ఉమ,రవీందర్,భాస్కర్, శంకర్,నరేష్ తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !