+91 99635 77856

అనుమానాస్పద స్థితిలో యువకుడు హత్య

Kudikala Sai Editor
maaksharamnews.in

అనుమానాస్పద స్థితిలో యువకుడు హత్య

హుజురాబాద్/అక్టోబర్ 05(మా అక్షరం): మండలం లోని రాజపల్లి గ్రామానికి చెందిన నోముల రాజు (30 )శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...

ఉదయం తల్లిదండ్రులైన నోముల చంద్రయ్య,ఎల్లమ్మలు ఇంటి ముందుకు వచ్చి మా కుమారుడు లేవడం లేదని చుట్టుపక్కల వారికి తెలిపారని.వారు ఇంట్లోకి వెళ్లి చూడగా మంచంపై రాజు శవమై ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జి,టౌన్ సిఐ తిరుమల్ గౌడ్, ఎస్ఐ యూనస్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి..నోముల రాజు హత్యకు గురైనట్లు గుర్తించారు.మంచంపై విగతజీవిగా ఉండగా అతని నుదిటిపై ఆయుధంతో కొట్టిన గాయాలు ఉన్నాయి. మంచం చుట్టూ రక్తం మరకలు ఉన్నాయి. గొడ్డలితోగాయపరిచి చంపి ఉంటారని పోలీసులు అనుమానించారు.మృతుని తల్లిదండ్రులు,సోదరుడు అంజిలను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. నోముల రాజు గత కొంతకాలంగా మద్యం సేవిస్తూ తల్లిదండ్రులతో
గొడవ పడుతుండేవాడని తెలిసింది. సోదరుడు
అంజి హైదరాబాదులో కారు నడుపుతూ
జీవిస్తున్నాడని గత నాలుగు రోజులుగా ఇంటి
వద్దనే ఉంటున్నాడని స్థానికులు తెలిపారు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

Share ePaper Clip

Preparing image...

హుజురాబాద్/అక్టోబర్ 05(మా అక్షరం): మండలం లోని రాజపల్లి గ్రామానికి చెందిన నోముల రాజు (30 )శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…

ఉదయం తల్లిదండ్రులైన నోముల చంద్రయ్య,ఎల్లమ్మలు ఇంటి ముందుకు వచ్చి మా కుమారుడు లేవడం లేదని చుట్టుపక్కల వారికి తెలిపారని.వారు ఇంట్లోకి వెళ్లి చూడగా మంచంపై రాజు శవమై ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జి,టౌన్ సిఐ తిరుమల్ గౌడ్, ఎస్ఐ యూనస్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి..నోముల రాజు హత్యకు గురైనట్లు గుర్తించారు.మంచంపై విగతజీవిగా ఉండగా అతని నుదిటిపై ఆయుధంతో కొట్టిన గాయాలు ఉన్నాయి. మంచం చుట్టూ రక్తం మరకలు ఉన్నాయి. గొడ్డలితోగాయపరిచి చంపి ఉంటారని పోలీసులు అనుమానించారు.మృతుని తల్లిదండ్రులు,సోదరుడు అంజిలను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. నోముల రాజు గత కొంతకాలంగా మద్యం సేవిస్తూ తల్లిదండ్రులతో
గొడవ పడుతుండేవాడని తెలిసింది. సోదరుడు
అంజి హైదరాబాదులో కారు నడుపుతూ
జీవిస్తున్నాడని గత నాలుగు రోజులుగా ఇంటి
వద్దనే ఉంటున్నాడని స్థానికులు తెలిపారు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !