+91 99635 77856

ఫిర్యాదుకు స్పందించిన లోకాయుక్త..

Kudikala Sai Editor
maaksharamnews.in

ఫిర్యాదుకు స్పందించిన లోకాయుక్త..

-అధికారులను విచారణకు ఆదేశించిన లోకాయుక్త రిజిస్ట్రార్...
హుజరాబాద్/అక్టోబర్05(మా అక్షరం): పట్టణం,మండలంలోని పలు అక్రమ కట్టడాలపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించకపోవడంతో లోపాయుక్తకు ఫిర్యాదు చేసినట్టు యువజన కాంగ్రెస్ నాయకులు టేకుల శ్రావణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పట్టణ శివారులో ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేకుండా యదేచ్ఛగా తమ ఇష్టానుసారంగా అక్రమ కట్టడాలు నిర్మిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని సంబంధిత శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ వాటిపై చర్యలు తీసుకోకుండా నోటీసుల పేరిట కాలయాపన చేశారని అన్నారు.ఇట్టి విషయమై ప్రజావాణిలో సైతం ఫిర్యాదు చేయగా స్పందన కరువైందని అందుకే న్యాయపోరాటం చేయడానికి సిద్ధమై లోకాయుక్తలో ఫిర్యాదు చేసినట్టు ఆయన తెలిపారు.లోకాయుక్త లో చేసిన ఫిర్యాదుకు స్పందించిన లోకాయుక్త అధికారులు నవంబర్ 8 తారీఖున ఉదయం 11 గంటల వరకు హాజరు కావాలని జిల్లా అధికారులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.ఫిర్యాదుకు స్పందించిన లోకాయుక్తకు రిజిస్ట్రార్ కి టేకుల శ్రావణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు

Share ePaper Clip

Preparing image...

-అధికారులను విచారణకు ఆదేశించిన లోకాయుక్త రిజిస్ట్రార్…
హుజరాబాద్/అక్టోబర్05(మా అక్షరం): పట్టణం,మండలంలోని పలు అక్రమ కట్టడాలపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించకపోవడంతో లోపాయుక్తకు ఫిర్యాదు చేసినట్టు యువజన కాంగ్రెస్ నాయకులు టేకుల శ్రావణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పట్టణ శివారులో ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేకుండా యదేచ్ఛగా తమ ఇష్టానుసారంగా అక్రమ కట్టడాలు నిర్మిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని సంబంధిత శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ వాటిపై చర్యలు తీసుకోకుండా నోటీసుల పేరిట కాలయాపన చేశారని అన్నారు.ఇట్టి విషయమై ప్రజావాణిలో సైతం ఫిర్యాదు చేయగా స్పందన కరువైందని అందుకే న్యాయపోరాటం చేయడానికి సిద్ధమై లోకాయుక్తలో ఫిర్యాదు చేసినట్టు ఆయన తెలిపారు.లోకాయుక్త లో చేసిన ఫిర్యాదుకు స్పందించిన లోకాయుక్త అధికారులు నవంబర్ 8 తారీఖున ఉదయం 11 గంటల వరకు హాజరు కావాలని జిల్లా అధికారులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.ఫిర్యాదుకు స్పందించిన లోకాయుక్తకు రిజిస్ట్రార్ కి టేకుల శ్రావణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !