+91 99635 77856

ప్రెస్ అకాడమీ చైర్మన్ ను కలిసిన హుజురాబాద్ ప్రెస్ క్లబ్

-దీపావళి తర్వాత ముఖ్యమంత్రితో సమావేశం..
-నివేషణ స్థలాల సమస్య పరిష్కరిస్తానని హామీ..
హుజురాబాద్/ అక్టోబర్ 23 (మా అక్షరం): జర్నలిస్టుల నివేశన స్థలాల సమస్యను ముఖ్యమంత్రితో చర్చించి సమస్యను పరిష్కరిస్తానని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం హుజరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో హైదరాబాదులో ప్రెస్ అకాడమీ చైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం ఆయన నివేశన స్థలాలపై స్పష్టమైన హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కో- కన్వీనర్లు కాయిత రాములు, నిమ్మటూరి సాయికృష్ణలు మాట్లాడుతూ.. గత 20 ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని గత ప్రభుత్వాన్ని ఒప్పించి పట్టాలు పొంది ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేశామన్నారు. కేసీ క్యాంపులో జర్నలిస్టులకు కేటాయించిన స్థలానికి ఈఎన్ సి ఇప్పించాల్సిందిగా
ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని విజ్ఞప్తి చేశామన్నారు.దీనిపై స్పందించిన ఆయన కూడా దీపావళి అనంతరం ముఖ్యమంత్రి తో సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారన్నారు. అనంతరం ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యుడు పోతరాజు సంపత్ ఉన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !