+91 99635 77856

ఎల్కతుర్తి లో తాటి ఈత చెట్లను నరికిన దుండగులు

ఎల్కతుర్తి/ అక్టోబర్ 25 (మా అక్షరం):మండల కేంద్రంలోని శుక్రవారం రోజున గౌడ సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎల్కతుర్తి మండల కేంద్రంలో గౌడ కళ్ళు గీత సొసైటీ పరిధిలో ఈత మరియు తాటి చెట్లను నేషనల్ హైవే రోడ్డు పనులకు సంబంధించిన కాంట్రాక్టర్ జెసిపి తో తొలగించిన క్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ గౌడ సంఘం అధ్యక్షులు మార్క అనిల్ కుమార్ గౌడ్ సంఘట స్థలాన్ని పరిశీలించి ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కళ్ళు పారే తాటి మరియు ఈత చెట్లను తొలగించి గౌడ కార్మికుల జీవనోపాధి దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు ఎక్సైజ్ శాఖ మరియు పోలీస్ శాఖ అధికారులు చెట్లను నరికిన వారిపై చర్యలు తీసుకొని మాకు న్యాయం జరిగే విధంగా చూడాలని కోరారు లేనియెడల గౌడ కులస్తులు గౌడ సంఘం ఏకమై ధర్నా రాస్తారోకో చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ గౌడ సంఘం గౌరవ అధ్యక్షులు బుర్ర పరశురాం గౌడ్ కార్యదర్శులు జాగిరి రవీందర్ గౌడ్ బత్తిని సాయిలు గౌడ్ ఎల్కతుర్తి గౌడ సంఘ అధ్యక్షులు జనగానే లక్ష్మీనారాయణ గౌడ్ ఎల్కతుర్తి మాజీ సర్పంచ్ యాదగిరి గౌడ్ ఎల్కతుర్తి గౌడ సంఘం అధ్యక్షులు గోడిషాల కుమారస్వామి గౌడ్ ఉపాధ్యక్షులు గోశాల రాజేష్ గౌడ్ కోశాధికారి శ్రీపతి సదానందం గౌడ్ బిక్షపతి గౌడ్, గొడిశాల నరేష్ గౌడ్ గొడిశాల సుమన్ గౌడ్ కందాల మొగిలి బుర్ర రవి కొత్తకొండ కుమార్ స్వామి గొడిశాల విక్రం గౌడ్ రా వీరస్వామి గౌడ్ గోడిశాల అర్జున్ గౌడ్ వివేక్ గౌడ్ సాంబరాజు గౌడ్ జనగాని నరేష్ గౌడ్ జనగాని రాజు బుర్ర తిరుపతి గౌడ్ గుడి కాళ్ల వినయ్ గౌడ్ సాంబరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !