+91 99635 77856

హూజురాబాద్ నుండి అరుణాచలం కు ప్రత్యేక బస్సు..

హుజురాబాద్/ అక్టోబర్ 27(మా అక్షరం): గురు పౌర్ణమి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం ఆరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయు భక్తుల కొరకు హుజురాబాద్ డిపో నుండి ప్రత్యేక సూపర్ లక్సరీ బస్సు ఏర్పాటు చేస్తున్నట్లు హుజురాబాద్ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ ఒక ప్రకటన లో తెలిపారు.తేది 13.11.2024 రోజున మధ్యాహ్నం 2.00 గంటలకు హుజురాబాద్ నుండి బయలుదేరి హైదరాబాద్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని కాణిపాకంలో గల వరసిద్ధి వినాయకుని దర్శించి అనంతరం వెల్లూరు లోని గోల్డెన్ టెంపుల్ లో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకుని నవంబర్ 14 వ తేదీ రాత్రి అరుణాచలం చేరుకుంటుంది.
అరుణాచలేశ్వర స్వామి వారి గిరిప్రదక్షిణ పూర్తయిన తర్వాత తిరుగు ప్రయాణంలో నవంబర్ 15 వ తేదీ సాయంత్రం బయలుదేరి 16 తేదీ ఉదయం శ్రీ అలంపూర్ జోగులాంబ అమ్మవారి శక్తిపీఠం సన్నిధిని దర్శించి అనంతరం హుజురాబాద్ కు అదే రోజు సాయంత్రం చేరుకుంటుంది.ఈ యాత్రలో నాలుగు దేవాలయల ప్రయాణానికి అన్ని ఛార్జీలు కలుపుకుని పెద్దలకు రూ.4500/- మరియు పిల్లలకు రూ.3800/- రూపాయలు ఛార్జ్ చేస్తున్నట్లు, భక్తులు వసతి, భోజనం మరియు దేవాలయ దర్శనం ఖర్చులు సొంతంగా భరించుకోవాలని డిపో మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు.మరిన్ని వివరాలకై డిపో కార్యాలయం నందు గాని మరియు ఫోన్ నెంబర్లు 9959225924, 9794833971, 9866117385, 9247159535 నందు సంప్రదించాలని, అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలనుకునే హుజురాబాద్, జమ్మికుంట మరియు హుస్నాబాద్ ప్రాంత వాసులు ఈ సౌకర్యం వినియోగించుకోవాలని ఆయన తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !