హుజురాబాద్/అక్టోబర్ 28(మా అక్షరం): పట్టణం లోని కోర్టులో అడ్వకేట్ గా పనిచేస్తున్న జీడి రవితేజను కాంగ్రెస్ పార్టీ హ్యూమన్ రైట్స్, ఆర్టిఐ డిపార్ట్ మెంట్ కు లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ గా లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ నియమించిన సందర్భంగా హుజురాబాద్ ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో సోమవారం ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి నాయకులు,అడ్వకేట్లు, వివిధ ప్రజా సంఘాల నాయకులు సన్మానించి రవితేజకు అభినందనలు తెలియజేశారు. పేద ప్రజలకు దళితులకు సరైన న్యాయం అందించుటకు తమ వంతుగా కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు రుద్రారపు రామచంద్రం మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తునికి వసంత్, ప్రముఖ కవి నాగుల సత్యం గౌడ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తడికమళ్ళ శేఖర్, ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవుని రవీందర్ మాదిగ,రిటైర్డ్ ఉద్యోగి కలవల మల్లయ్య, రొంటాల బుచ్చయ్య, అడ్వకేట్లు రఫీ,కలకోటి శ్రావణ్,ఎమ్మార్పీఎస్ హుజురాబాద్ మండల అధ్యక్షుడు రొంటాల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.











