+91 99635 77856

నవ క్రాంతి రైతు ఉత్పత్తి దారుల సంస్థ( BCI)ఆధ్వర్యంలో శిక్షణ

రైతన్న మేలుకో ఆరోగ్యాన్ని కాపాడుకో భూమిని కాపాడు -ఆరోగ్యాన్ని సంరక్షించుఎలకతుర్తి మండలం పెంచికల్ పేట గ్రామంలో ఉత్తమ పత్తి యాజమాన్య పథకం, ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ నిధి సహకారంతో నవ క్రాంతి రైతు ఉత్పత్తి దారుల సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. బీసీఐ మాస్టర్ ఫీల్డ్ ఫెసిలిటేటర్ లో నిషేధిత అత్యంత విషపూరితమైన పురుగుమందులు మనుషుల ఆరోగ్యానికి పర్యావరణానికి అత్యధిక హాని కలిగిస్తాయని, మనుషుల ఆరోగ్యానికి దీర్ఘకాలంలో క్యాన్సర్ కారక జన్యుపరమైన హార్మోనుల్ల పైన ప్రభావం కలిగిస్తాయని భావితరాల పిల్లలలో కూడా శారీరక మానసిక వైకల్యాన్ని కలిగిస్తాయని రైతులు అర్థం చేసుకొని వాటిని పూర్తిగా మానివేయాలని చెప్పడం జరిగింది. పర్యావరణంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపి పక్షులు జలచరాలు మరియు జంతువులకు ముప్పు వాటిల్లుతుందని రైతులకు తెలపరు. బీసీఐ క్షేత్ర సిబ్బంది లత మాట్లాడుతూ రైతులు భూసారా వరీక్షలు నిర్వహించుకొని, వాటి ఫలితాలు ఆధారంగా ఎరువులు వాడుకోవాలని తెలుపుతూ 20 మంది రైతుల భూసార పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలపరు. బీసీఐ మాస్టర్ ఫీల్డ్ ఫెసిలిటెటర్ వంగ, రఘు మాట్లాడుతూ వంట అవశేషాలను కాల్చడం వలన గ్రీన్ హౌస్ గ్యాస్ లు (కార్బన్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ) గాలిలొ కలిసిపోయి వాతావరణ మార్పులు ఏర్పడతాయని ఫలితంగా అధిక వర్షాలు లేదా వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయని. ఆ ప్రదేశం లోని మేలుచేసే సూక్ష్మ జీవులకి ప్రమాదం ఏర్పడుతుందని కావున పంట అవశేషాలు నేలలో కలియ దున్నడం వలన భూమిలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది, నేలలో పోషకాలు స్థాయి పెరగడం వల్ల కొంత వరకు భూమిలో రసాయన ఎరువులను తగ్గించుకోవచ్చు రైతులు పెట్టుబడి తగ్గించుకొని దిగుబడి పెంచుకోవడంతోపాటు, వాతావరణ మార్పులును అరికట్టవచ్చని తెలుపరు. అనంతరం గ్రామ రైతులతో కలిసి ర్యాలీ చేస్తూ “రైతన్న మేలుకో -ఆరోగ్యాన్ని కాపాడుకో”. “రసాయనాలు వద్దు- సేంద్రియలు ముద్దు అంటూ నినాదాలు పలకరు. ఈ కార్యక్రమంలో బీసీఐ సిబ్బంది.లత,రాజేందర్ మౌనిక మరియు గ్రామ రైతులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు….

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !