+91 99635 77856

ఆల్ఫోర్స్ జీనియస్ లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు

-ఆల్ఫోర్స్ జీనియస్ లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు…
హుజురాబాద్/ ఫిబ్రవరి 28 (మా అక్షరం): పట్టణంలోని స్థానిక ఆల్ఫోర్స్ జీనియస్ పాఠశాలలో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన పలు ప్రాజెక్టులు అందరిని ఆకర్షించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ…మనం ఎంతో గర్వంగా జరుపుకుంటున్న సైన్స్ దినోత్సవం మన జీవితాల్లో శాస్త్ర విజ్ఞానానికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తు చేస్తుందనీ, శాస్త్రం లేకుండా ఈ ఆధునిక ప్రపంచాన్ని ఊహించలేమని,విద్యుత్, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్, వైద్యం ఇవన్నీ శాస్త్ర విజ్ఞాన ఫలితాలే అని, అలాగే శాస్త్రం అనేది కేవలం పుస్తకాలలో ఉన్న విషయం కాదనీ, ప్రశ్నించడం, పరిశీలించడం, ప్రయోగాలు చేయడం, కొత్త ఆలోచనలు తీసుకురావడం ఇవే నిజమైన శాస్త్ర లక్షణాలనీ, మన విద్యార్థులు చిన్న వయసు నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలనీ తెలిపారు.ఈ సందర్భంగా ఉత్తమ ప్రాజెక్టులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !