+91 99635 77856

నోరు ఉంది కదా అని పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదు..

– జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డైరెక్టర్ అలువాల కోటి..
– కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అదికార ప్రతినిధి పసుల వెంకటి…
కరీంనగర్/తిమ్మాపూర్, అక్టోబర్29(మా అక్షరం) మండల ఎల్ఎండిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ దళిత నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డైరెక్టర్ అలువాల కోటి మాట్లాడుతూ…..రసమయి బాలకిషన్ తన పదవి పోయినప్పటి నుండి కమీషన్లు రాక మెదడు పనిచేయక పదేళ్ళుగా కమీషన్లు తీసుకున్న అలవాటుకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కమీషన్లు తీసుకుంటున్నాడన్న భ్రమలో కవ్వంపల్లి సత్యనారాయణను కమీషన్ల నారాయణ అంటూ పిచ్చి కూతలు కూస్తూ అవాకులు చేవాకులుగా మాట్లాడడం చాలా సిగ్గు చేటని, కవ్వంపల్లి కుటుంబంలో అందరూ విద్యావంతులేనని పేద ప్రజలకు ప్రాణభిక్ష పెట్టిన కుటుంబం వాళ్లదని అలాంటి వారిపై ఎన్నో అసత్యపు మాటలు మాట్లాడాడని అన్నారు.జన్వాడ ఫాంపౌజ్ లో జరిగిన దివాళీ దావత్ లో డ్రగ్స్ వాడినట్టుగా నమోదైన కేసులో పరారీలో ఉన్న ఆ ఫాంహౌజ్ యజమాని రాజ్ పాకాలతో రసమయి బాలకిషన్ కు బలమైన సంబంధాలున్నాయని, రాజ్ పాకాల ఇంట్లో రసమయి ఫొటోలు ఉండటం అనుమానాలకు తావిస్తోందని ఈ వ్యవహారంలో రసమయి పాత్ర తేలాల్సి ఉందన్నారు. పార్టీలో కొకైన్ మద్దూరి విజయ్ కొకైన్ వాడినట్టుగా పరీక్షల్లో తేలడమే కాకుండా స్వయంగా ఆయనే పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నందున జన్వాడ ఫాంహౌజ్ లో జరిగింది మందు పార్టీ కాదని, డ్రగ్ పార్టీ అని వారు పేర్కొన్నారు. గులాబీ నేతులు డ్రగ్ పార్టీని మందు పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు.ఇంట్లో జరిగే విందయితే క్యాసినోలో వాడే కాయిన్లతో పనేమిటని వారు ప్రశ్నిస్తూనే ఇది తెలంగాణ సంస్కృతి కాదని పేర్కొన్నారు.ఉద్యమ సమయంలో అంతర్పుల నాగరాజు ధూమ్ ధామ్ ను ఏర్పాటు చేస్తే దాన్ని పక్కకు నెట్టి కళాకారులను తొక్కి ధూంధాం వ్యవస్థాపకుని నేనేనని చెప్పుకున్న బట్టే బాస్ దగుల్బాజీ రసమయ అని అన్నారు.2009లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుంటే కెసిఆర్ కుటుంబంతో నాకు ప్రాణభయం ఉందని చెప్పినటువంటి రసమయి ఈరోజు దొరకాళ్ల దగ్గర కుక్కలా ఉన్నాడని ఎద్దేవా చేశారు. ఉద్యమ కుటుంబానికి పోకర్స్, విదేశీమధ్యం ఎలా వచ్చిందని పదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి అసలైన ఉద్యమకారులను అణచివేశి ఊరు వదిలి వెళ్ళే విధంగా చేశాడని, రసమయి ఒత్తిళ్ళు తట్టుకోలేక తట్టుకోలేక ఎంతోమంది ఆత్మహత్యకు పాల్పడ్డారని, 14 ఏళ్ళు ఉద్యమంలో రసమయి వెంట తిరిగిన వాళ్ల భూములు అమ్మి అప్పుల పాలయ్యే విధంగా చేసాడని అలాంటి రసమయికి కవ్వంపల్లి సత్యనారాయణను విమర్శించే స్థాయి లేదని మండిపడ్డారు. కవ్వంపల్లి పై అసత్య వార్తలు ప్రచారం చేస్తుందని మైత్రి చానల్ పై మేము మండిపడితే రసమయికి వచ్చిన ఇబ్బంది ఏంటని తన ప్రస్తావన మేము తీయనే లేదని కొత్త జయపాల్ రెడ్డికి రసమయికి ఉన్న ఫెవికిక్ బందం ఏంటని ప్రశ్నించారు.కవ్వంపల్లి ఎమ్మెల్యేగా అయిన మొదటి విడత లోనే 200 కోట్ల రూపాయల విలువ చేసే యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ పాఠశాలను తీసుకువచ్చాడని,చొక్కారావుపల్లి నుండి కరీంనగర్ కు దాదాపు 15కిలో మీటర్ల వరకు బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రతిపాదనలు ఏర్పాట్లు చేశారని ,పదేళ్ళ బిఆర్ఎస్ పాలనలో కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కాకుండా రసమయి తీసుకువచ్చిన నిధులు ఏంటో చెప్పాలని, గుండ్లపెల్లి స్టేజి వద్ద చెప్పు దెబ్బలైన చరిత్ర రసమయిదని మండిపడ్డారు .కరోనా సమయంలో వైన్స్ లలోని 500రూపాయల మందుబాటిళ్ళను 5000రూపాలకు అమ్ముకున్న ఘను చరిత్ర రసమయిదని,రసమయి దొంగ మందు అమ్ముకున్నట్లు,పేకాట కేంద్రాలు నిర్వహించినట్లు తాను నిరూపిస్తానని, రసమయి దళితుడినని చెప్పుకోవడం దళితులకు సిగ్గు చేటని,రసమయి ఇకనుండి బాహుబలి -2 చూపిస్తాం అంటున్నాడని, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై గాని కాంగ్రెస్ పార్టీ పై గాని తప్పుడు కూతలు కూస్తే మేమే రసమయికి పుష్ప-2 చూపించడం తప్పదని అలువాల కోటి హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అదికార ప్రతినిధి పసుల వెంకటి మాట్లాడుతూ …..సోమవారం మాజీ ఎమ్మెల్యే రసమయి మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, దళిత బిడ్డనని చెప్పుకుంటూ అదే దళితులను కుక్కలు, గజ్జి కుక్కలు అని సంబోధించాడని, రసమయి కుక్క గజ్జి కుక్క అయితే మిగతావాళ్లు అదే అవుతారని అన్నారు.రసమయి 2014లో 170 గజాల జాగా గోచి గొంగడి ఒక డప్పు గజ్జలు పెట్టాడని 2019లో మీ పిల్లలు భార్య పేరు మీద ఎంత ఉందో గుర్తు చేసుకోవాలని, 2023లో మూడు కోట్ల 58 లక్షల 49 644 ఉన్నట్లు పెట్టావని ఇప్పుడు నీకు ఇన్ని ఫామ్ హౌస్ లు ఏసీ కోళ్ల ఫారాలు విలాసాలు ఎలా వచ్చాయో రుజువు చేయాలని అన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లికి రాజకీయంలోకి రాకముందే అన్నీ ఉన్నాయని రసమయికి ఏమీ లేవని ఇంకోసారి కవంపల్లిని విమర్శిస్తే మేమే మిమ్మల్ని నియోజకవర్గంలో తిరగనియ్యమని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కనుకం అశోక్, మచ్చ రాజేశం, కొంకటి రాములు, నాయకులు చలిగంటి సంపత్, జీడీ శ్యామ్, కోండ్ర సురేష్, అలువాల కుమార్, శంకర్, మాతంగి సంతీష్, ఎస్.అనిల్, మానాల రవి ఎస్.శ్రీనివాస్, జే.మధు.శ్రీనివాస్, ఎల్.శ్రీనివాస్,కె.రాములు,ఎం ప్రభాకర్,రాసూరి మల్లికార్జున్, సిరిసిల్ల రాజు, యు.నరేష్. హాసన్, ఎల్ మల్లయ్య టి.జంపన్న జి.రాజమల్లు, జి.చిట్టిబాబు,కనకం కుమార్,ఎస్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !