-శాతవాహన జేఏసీ చైర్మన్ చెన్నమల్ల చైతన్య..
హుజరాబాద్/అక్టోబర్ 30(మా అక్షరం): నియోజకవర్గంలో పట్టభద్రులందరూ రాబోవు ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలంగాణ ఉద్యమ కారులు, పోరాట యోధులు సర్దార్ రవీందర్ సింగ్ నీ ఎమ్మెల్సీ గా గెలిపించి పట్టం కట్టాలనీ శాతవాహన జేఏసీ చైర్మన్ చెన్నమల్ల చైతన్య కోరారు. బుధవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ఆదిలాబాద్,కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎన్నిక కోసం డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ తమ పేరును నమోదు చేసుకోవాలని రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో విద్యావంతులైన పట్టభద్రులు.. ప్రజల కోసం, విద్యార్థి, నిరుద్యోగుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న వ్యక్తులను ఎన్నుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన పోరాట యోధుడు సర్దార్ రవీందర్ సింగ్ కి మద్దతు తెలిపి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. హుజూరాబాద్ గడ్డా అంటేనే పోరాటాల అడ్డ అని ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా చైతన్యవంతులైన యువకులే కాబట్టి అడ్డదారుల్లో అక్రమ డబ్బు సంపాదించి ఓటర్లను ప్రలోభ పెట్టే వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడం సమాజానికి మంచిది కాదని అన్నారు. రేపటి భవిష్యత్తును నిర్మించే పట్టభద్రులు వివేకంతో ఆలోచించి, ఎలాంటి ప్రలోభాలకు తలోగకుండా ప్రజల కోసం, విద్యార్థి, నిరుద్యోగుల కోసం పనిచేసే వ్యక్తులను ఎన్నుకొని చట్టసభల్లోకి పంపాలని సూచించారు. నవంబర్ 6వ తేదీ వరకు అర్హులైన గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవాలని, పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్లు ఫారం-18 లో దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. ఇంతకు ముందు ఓటు హక్కు కలిగి ఉన్నవాళ్లు కూడా తప్పకుండా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని వివిధ కళాశాలల నుంచి డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థిని విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకువలన్నారు.ఈ కార్యక్రమంలో శనిగరం అరుణ్ కుమార్, బండ అశోక్,నైతం మహేష్, కొత్త కొండ శ్రవణ్,సిద్దు అరవింద్ సుద్దేర్ సన్నీ శివ పవన్ సాయి నాయక్, అమరేష్,రవి, మహేష్ , అరుణ్,అశోక్ తదితరులు పాల్గొన్నారు.











