+91 99635 77856

సహకార సంఘం పెట్రోల్ పంపును ప్రారంభించిన ఎమ్మెల్యే..

కరీంనగర్, తిమ్మాపూర్/ అక్టోబర్ 30 (మా అక్షరం): మండలం లోని నుస్తులాపూర్ గ్రామంలోని కరీంనగర్ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును బుధవారం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కరీంనగర్ సహకార సంఘం బ్యాంకు చైర్మన్ కొండూరు రవీందర్ రావు రావుతో కలిసి ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ…. సహకార సంఘ రంగంలో ఎంతో అభివృద్ధి సాధించి కరీంనగర్ సహకార సంఘానికి దశా,దిశను చూపించినటువంటి వ్యక్తి , బ్యాంకును లాభాల బాటలో నడిపించినటువంటి వ్యక్తి, ఎన్నో సేవలను ఈ యొక్క సహకార సంఘానికి తృణీకరించిన గొప్ప మనసున్న వ్యక్తి కే డి సి సి బ్యాంక్ చైర్మన్ రవీందర్ రావు అని కొనియాడారు. అంకితభావం ఉంటే ఏ బ్యాంకునైనా, ఏ సంస్థనైనా అభివృద్ధి పథంలో, లాభాల బాటలో నడిపించవచ్చని లీడర్ బాగుంటే ఫాలోవర్స్ కూడా బాగుంటారని, బ్యాంకు సంస్థ పట్ల అవగాహన ఉండి పెట్రోల్ బంక్ మూతపడ్డ కూడా నిరుత్సాహపడకుండా హోం మంత్రితో చాలాసార్లు సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వంతో పోరాటం చేసి బంకులను మళ్లీ ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి రవీందర్ రావు అని అన్నారు. కాబట్టి సభ్యులందరూ పెట్రోల్ బంకును ఉపయోగించుకుని బ్యాంకును లాభాల బాటలో నడిపించాలని కోరారు..
సహకార సంఘం బ్యాంకు చైర్మన్ కొండూరు రవీందర్ రావు మాట్లాడుతూ…
గతంలోనే సహకార సంఘాల ఆధ్వర్యంలో బంకులు ప్రారంభమైనప్పటికీ ఈ బంకు మాత్రం సంవత్సర కాలం పాటు ప్రారంభానికి నోచుకోలేదని, సంఘంలోని సభ్యుల సౌకర్యార్థం లాకర్లు, స్ట్రాంగ్ రూంలు, బంకులు, ఈ సేవ లాంటి 26రకాల సేవలతో కూడిన కామన్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేశామని కొత్తగా ఈమద్యనే సభ్యులందరికీ, ఈ సహకార సంఘం పరిధిలోని వారికి సమాజ సేవలో బాగంగా సంఘం తరుపున ఆరోగ్య సేవలు అందించేందుకు ఎమ్ స్వచ్చ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని,ఏ ప్రభుత్వం ఉన్న సమాజానికి ఆరోగ్యం విద్య అనేది అవసరమని ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండాలనే ఆలోచనతోనే ఇటువంటి కార్యక్రమాలు చేపట్టామని, సంఘంలో అప్పు తీసుకున్న ప్రతి ఒక్కరు సంఘానికి యజమానులేనని.. సభ్యులకు ఇది నాది అనే భావన కూడా ఉండాలని గుర్తు చేశారు…త్వరలో సమీప మండలమైన గన్నేరువరం లో సభ్యుల సౌకర్యార్థం సంఘాన్ని ఏర్పాటు చేసి సంఘాలను పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తామని కావున అందరు సభ్యులు సంఘం ఎటువంటి ఆటంకాలు లేకుండా నడవడాని తమ పూర్తి సహకారం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో
సింగిల్ విండో చైర్మన్ గుజ్జుల రవీందర్ రెడ్డి, కేడీసీసీ డైరెక్టర్ అలువాల కోటి, పొరండ్ల సంఘం చైర్మన్ స్వామి రెడ్డి, గట్టు దుద్దెనపెల్లి చైర్మన్ అనభేరి రాదా కిషన్ రావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, మాజీ సర్పంచ్ తుమ్మనపల్లి శ్రీనివాస్ రావు, మాజీ ఎంపీటీసీ కొత్త తిరుపతిరెడ్డి, పొలంపెల్లి మాజి ఎంపిటిసి బండారి రమేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గోగూరి నర్సింహారెడ్డి, బుధారపు శ్రీనివాస్, ఎస్.కొండల్ రావు, చిరంజీవి,ఆశిక్ పాషాతో పాటు సింగిల్ విండో అధికారులు, డైరెక్టర్లు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !