+91 99635 77856

టిబి రహిత జిల్లాగా మార్చడానికి కృషి

– డాక్టర్ రవీందర్ రెడ్డి..
హుజురాబాద్ జిల్లాను క్షయ (టీబి) రహిత జిల్లాగా మార్చడానికి వైద్యులు ప్రజల సహకారంతో కృషి చేయడం జరుగుతుందని జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి అన్నారు.శనివారం హుజురాబాద్ మండల పరిషత్ సమావేశ మందిరంలో క్షయ నివారణ విభాగం,టీబీ అలర్ట్ ఇండియా – ఇంపాక్ట్ ఇండియా ప్రాజెక్ట్,చెల్పూర్ పిహెచ్సి వైద్యాధికారి ఆధ్వర్యంలో టీబీ చాంపియన్స్ శిక్షణా కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… క్షయ వ్యాధి లక్షణాలు, వ్యాధి తగ్గించుకునే అవకాశాలు, చికిత్స పద్ధతులు గురించి ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలని అన్నారు. క్షయవ్యాధి తీవ్రమైన వ్యాధిగా ప్రస్తుతం లేదని, చికిత్స ద్వారా దానిని తగ్గించుకోవచ్చని అన్నారు. మొదట క్షయ వ్యాధి అంటే భయం ఉండకూడదని,డాక్టర్ల సలహా, సూచనల మేరకు మందులు వాడితే తగ్గుతుందని అన్నారు. క్షయ వ్యాధితో బాధపడేవారు తగు జాగ్రత్తలు వహించడం వల్ల ఇతరులకు వ్యాధి సంక్రమించకుండా ఉంటుందని అన్నారు. ప్రభుత్వం క్షయ వ్యాధికి ఉచిత వైద్యం అందిస్తుందని,లక్షణాలు ఉన్నవారు అశ్రద్ధ వహించకూడదని, వెంటనే నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మామిండ్లవాడ సబ్ సెంటర్ డాక్టర్ జరీనా, హుజురాబాద్ టియు ఎస్టిఎస్ శ్రీనివాస్ రెడ్డి, హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్, విజేందర్ రెడ్డి, హెల్త్ సూపర్ వైజర్ సమ్మయ్య, సత్యం, నిశాంత్, గీతాంజలి, టిబి అలెర్ట్ ఇండియా సిబ్బంది పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !