+91 99635 77856

ప్రహరీ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ..

Kudikala Sai Editor
maaksharamnews.in

ప్రహరీ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ..

కరీంనగర్, తిమ్మాపూర్/ నవంబర్18(మా అక్షరం):తిమ్మాపూర్ మండలం నల్లగొండలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ఆవరణలో ఆలయ చైర్మన్ బండారుపెల్లి లక్ష్మణ్ గౌడ్ ఆద్వర్యంలో ప్రహరీ గోడ నిర్మాణం కోసం ఏర్పాటుచేసిన భూమి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హజరై భూమి పూజ చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ... దేవాలయానికి ఒక పవిత్రతను చేకూర్చే విధంగా, భక్తుల సౌకర్యార్థం దేవాలయ ఆవరణలో పూజా కార్యక్రమాలు మాత్రమే జరిగే విధంగా ప్రహరి గోడ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందని, ఇక్కడకు వచ్చే ప్రతి భక్తుడు భక్తి తన్వయత్వంలో ఉండే విధంగా 30 లక్షలే కాకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరిన్ని నిధులు మంజూరు చేయించి జాతరలోపు దేవాలయ మరింత అబివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆలయ చైర్మన్ లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ నల్లగొండ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం చాలా మహిమాన్వితమైనదని, ప్రతి సంవత్సరం మార్చి నెలలో వారం రోజుల పాటు స్వామి వారి జాతర ఘనంగా జరుగుతుందని ఈ జాతరకు ఇతర రాష్ట్రాల నుండి అనేక మంది భక్తులు వచ్చి స్వామి దర్శనం చేసుకుంటారని, భక్తుల సౌకర్యార్థం దేవాలయానికి ప్రహరి గోడ భూమి పూజ చేయడం సంతోషంగా ఉందని, దేవాలయ ఆవరణలో ఎన్నో కళ్యాణాలు జరుగుతున్నాయని, గత పది సంవత్సరాల క్రితమే ఇక్కడ కళ్యాణ మండప నిర్మాణాన్ని మొదలుపెట్టారని కాని అది పూర్తి కాలేదని, కళ్యాణ మండపం నిర్మాణం కూడా పూర్తి చేయించాలని ఎమ్మెల్యేని కోరారు. అలాగే ఆలయానికి సంబంధించిన భూములు కొందరు ఆక్రమించారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని కూడా ఆలయానికే చెందే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కవ్వంపల్లిని చైర్మన్ లక్ష్మణ్ గౌడ్ కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాద్యక్షుడు మోరపెల్లి రమణారెడ్డి, గ్రామ శాఖ అద్యక్షుడు మార్క నర్సయ్య, నాయకులు తుమ్మనపెల్లి శ్రీనివాస్ రావు, రాములు, బండారి రమేష్, ఆలయ కమిటీ సభ్యులు భూత్కూరి శ్రీనివాస్ ,గాండ్ల అంజయ్య, కవ్వంపల్లి మహేష్, జింక శ్రీనివాస్, గోలి నర్సయ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

కరీంనగర్, తిమ్మాపూర్/ నవంబర్18(మా అక్షరం):తిమ్మాపూర్ మండలం నల్లగొండలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ఆవరణలో ఆలయ చైర్మన్ బండారుపెల్లి లక్ష్మణ్ గౌడ్ ఆద్వర్యంలో ప్రహరీ గోడ నిర్మాణం కోసం ఏర్పాటుచేసిన భూమి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హజరై భూమి పూజ చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ… దేవాలయానికి ఒక పవిత్రతను చేకూర్చే విధంగా, భక్తుల సౌకర్యార్థం దేవాలయ ఆవరణలో పూజా కార్యక్రమాలు మాత్రమే జరిగే విధంగా ప్రహరి గోడ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందని, ఇక్కడకు వచ్చే ప్రతి భక్తుడు భక్తి తన్వయత్వంలో ఉండే విధంగా 30 లక్షలే కాకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరిన్ని నిధులు మంజూరు చేయించి జాతరలోపు దేవాలయ మరింత అబివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆలయ చైర్మన్ లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ నల్లగొండ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం చాలా మహిమాన్వితమైనదని, ప్రతి సంవత్సరం మార్చి నెలలో వారం రోజుల పాటు స్వామి వారి జాతర ఘనంగా జరుగుతుందని ఈ జాతరకు ఇతర రాష్ట్రాల నుండి అనేక మంది భక్తులు వచ్చి స్వామి దర్శనం చేసుకుంటారని, భక్తుల సౌకర్యార్థం దేవాలయానికి ప్రహరి గోడ భూమి పూజ చేయడం సంతోషంగా ఉందని, దేవాలయ ఆవరణలో ఎన్నో కళ్యాణాలు జరుగుతున్నాయని, గత పది సంవత్సరాల క్రితమే ఇక్కడ కళ్యాణ మండప నిర్మాణాన్ని మొదలుపెట్టారని కాని అది పూర్తి కాలేదని, కళ్యాణ మండపం నిర్మాణం కూడా పూర్తి చేయించాలని ఎమ్మెల్యేని కోరారు. అలాగే ఆలయానికి సంబంధించిన భూములు కొందరు ఆక్రమించారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని కూడా ఆలయానికే చెందే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కవ్వంపల్లిని చైర్మన్ లక్ష్మణ్ గౌడ్ కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాద్యక్షుడు మోరపెల్లి రమణారెడ్డి, గ్రామ శాఖ అద్యక్షుడు మార్క నర్సయ్య, నాయకులు తుమ్మనపెల్లి శ్రీనివాస్ రావు, రాములు, బండారి రమేష్, ఆలయ కమిటీ సభ్యులు భూత్కూరి శ్రీనివాస్ ,గాండ్ల అంజయ్య, కవ్వంపల్లి మహేష్, జింక శ్రీనివాస్, గోలి నర్సయ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !