+91 99635 77856

చలో ఢిల్లీ బహిరంగ సభ విజయవంతం చేయాలి..

– మనువాదుల నుండి రాజ్యాంగాన్ని రక్షించాలి.. 
-మోడీ రాక్షస పాలనలో దేశవ్యాప్తంగా దళితులపై దాడులు..
-టిపిసిసి ఎస్ సి డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంఛార్జి తిప్పారపు సంపత్..

హైదరాబాద్/ నవంబర్19(మా అక్షరం): మోడీ ఏ రాజ్యాంగం ద్వారానైతే ప్రధానమంత్రి అయ్యారో అదే రాజ్యాంగాన్ని నీరుగార్చాలని చూస్తున్నారా అని అన్నారు. మంగళవారం టిపిసిసి ఎస్సీ డిపార్ట్మెంట్ అట్రాసిటీస్ రాష్ట్ర ఇంఛార్జి తిప్పారపు సంపత్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో చలో ఢిల్లీ వాల్ పోస్టర్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… తెలంగాణ వ్యాప్తంగా టిపిసిసి ఎస్సి డిపార్ట్మెంట్ చైర్మన్ ప్రీతం నాయకత్వంలో చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయాలని నవంబర్ 26వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని చల్లో ఢిల్లీ తల్కాతొర స్టేడియంలో జాతీయ కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా రాహుల్ గాంధీ, మల్లికార్జున కార్గే, కొప్పుల రాజు, రాజేష్ లిలోతియా, ముఖ్య నాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు.

 

తెలంగాణ వ్యాప్తంగా గ్రామ గ్రామాన ప్రజలు తరలిరావాలని పిలుపునిస్తూ దేశవ్యాప్తంగా గత 10 సంవత్సరాల నుండి మోడి పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ,బీసీ,మైనార్టీల,మీద అనేక దాడులు మతతత్వ వాదులు చేస్తుంటే ఈ మోడీ బిజెపి ప్రభుత్వం వారిని కాపాడుతూ వస్తుంది గత కొన్ని నెలల నుండి రాజ్యాంగాన్ని విచ్చిన్నం చేయాలని కుట్రతో ప్రజాస్వామ్యవాదుల పై కేసులు పెట్టి అనేక మందిని జైలుకు పంపిస్తున్నారని, బిజెపి పాలిత ప్రాంతాల్లో దళితులపై రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయని, ప్రశ్నించిన దళితులపై హీనంగా నగ్నంగా ఎంతోమందిని హత్య చేస్తున్నారని దీన్ని బిజెపి ప్రభుత్వం నేరస్తులకే వత్తాసు పలుకుతూ రాజ్యాంగాన్ని ఎత్తివేయాలని బిజెపి ప్రభుత్వం మోడీ నాయకత్వంలో కుట్రలు చేస్తున్నారని అన్నారు. ప్రజలంతా చైతన్యవంతులై మోడీ ప్రభుత్వం పై దేశవ్యాప్తంగా పోరాటాలు చేయాలని పిలుపునిస్తున్నామని అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !