+91 99635 77856

అన్న మృతిని తట్టుకోలేక.. ఆగిన చెల్లి గుండె..

Kudikala Sai Editor
maaksharamnews.in

అన్న మృతిని తట్టుకోలేక.. ఆగిన చెల్లి గుండె..

కరీంనగర్, తిమ్మాపూర్/ నవంబర్ 19 (మా అక్షరం):అన్న మృతిని తట్టుకోలేక ఓ చెల్లి గుండె ఆగింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.గ్రామంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ప్యాట ఎల్లయ్య(70) అనారోగ్యంతో హైదరాబాద్ లోని నీమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మంగళవారం దహన సంస్కారాల్లో ఎల్లయ్య చితికి నిప్పు పెట్టుతున్న క్రమంలో ఎల్లయ్య చెల్లెలు నాగం రాజవ్వ అన్న మృతిని తట్టుకోలేక మృతదేహం మీద పడి ఏడుస్తూ అక్కడికక్కడే కుప్పకూలి మరణించింది.ఈ సంఘటనను చూసిన ఇరువురి కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు కన్నీరు మున్నీరయ్యారు. తన అన్న లేడన్న నిజాన్ని తట్టుకోలేక తాను మరణించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Share ePaper Clip

Preparing image...

కరీంనగర్, తిమ్మాపూర్/ నవంబర్ 19 (మా అక్షరం):అన్న మృతిని తట్టుకోలేక ఓ చెల్లి గుండె ఆగింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.గ్రామంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన ప్యాట ఎల్లయ్య(70) అనారోగ్యంతో హైదరాబాద్ లోని నీమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మంగళవారం దహన సంస్కారాల్లో ఎల్లయ్య చితికి నిప్పు పెట్టుతున్న క్రమంలో ఎల్లయ్య చెల్లెలు నాగం రాజవ్వ అన్న మృతిని తట్టుకోలేక మృతదేహం మీద పడి ఏడుస్తూ అక్కడికక్కడే కుప్పకూలి మరణించింది.ఈ సంఘటనను చూసిన ఇరువురి కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు కన్నీరు మున్నీరయ్యారు. తన అన్న లేడన్న నిజాన్ని తట్టుకోలేక తాను మరణించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !