+91 99635 77856

29న దీక్ష దివాసును విజయవంతం చేయండి..

Kudikala Sai Editor
maaksharamnews.in

29న దీక్ష దివాసును విజయవంతం చేయండి..

- మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్..
కరీంనగర్, తిమ్మాపూర్ నవంబర్ 26 (మా అక్షరం):కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలకేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హజరై మాట్లాడుతూ......కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదికావస్తున్న ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని ప్రజలను మోసం చేస్తూ విజయోత్సవాల పేరుతో ప్రభుత్వం సంబరాలు చేస్తుందని,మీకు దమ్ముంటే విజయోత్సవాలు ప్రజల మధ్య నిర్వహించాలని ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా విజయోత్సవాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.ప్రజలు ఈ విజయోత్సవాలను సంవత్సరికంలా భావిస్తున్నారని, డిసెంబర్ నుండి ఈ అసత్యపు ప్రచారాన్ని తాము కూడా గ్రామ గ్రామాన ప్రజల సమక్షంలోనే సంవత్సరికంలా నిర్వహిస్తామని తెలిపారు.తెలంగాణా అనేక ఉద్యమాలలో కరీంనగర్ జిల్లాకు విజయాల చరిత్ర ఉందని, తెలంగాణ సాధించాలన్న గొప్ప లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 2001లో మొదటి సింహ గర్జన కరీంనగర్ నుండే ప్రారంభించారని,2009లో యూపిఏ ప్రభుత్వం తెలంగాణ ప్రకటన ఇచ్చి వెనుకకు తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర సాధనకు ఇదే నా చివరి పోరాటం కావాలనే సంకల్పంతో కరీంనగర్ గడ్డ నుండే కేసిఆర్ మళ్ళీ దీక్ష చేపట్టారని గాంధీజీ సత్యాగ్రహ దీక్ష ఎంత బలమైనదో కరీంనగర్ నుండి కేసిఆర్ చేపట్టిన దీక్ష కూడా అంతే బలమైనదిగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని, తెలంగాణ సాదించిన కేసిఆర్ కు కృతజ్ఞతా భావంతో ఈ నెల 29న అల్గునూర్ లో దీక్షా దివాస్ కార్యక్రమాన్ని బిఆర్ఎస్ ఏర్పాటు చేస్తుందని,ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ హాజరవుతారని కాబట్టి జిల్లాలోని బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని దీక్షా దివాస్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావు, పార్టీ మండలాద్యక్షుడు తాళ్ళపెళ్ళి శేఖర్ గౌడ్,మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సిద్దం వేణు, మాజీ సర్పంచ్ దేవ సత్తీష్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి శాతరాజు యాదగి ,బిఆర్ఎస్ సోషల్ మీడియా సదయ్యగౌడ్, నాయకులు పిట్టల మదు,కనకం అనీల్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

– మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్..
కరీంనగర్, తిమ్మాపూర్ నవంబర్ 26 (మా అక్షరం):కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలకేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హజరై మాట్లాడుతూ……కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదికావస్తున్న ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని ప్రజలను మోసం చేస్తూ విజయోత్సవాల పేరుతో ప్రభుత్వం సంబరాలు చేస్తుందని,మీకు దమ్ముంటే విజయోత్సవాలు ప్రజల మధ్య నిర్వహించాలని ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా విజయోత్సవాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.ప్రజలు ఈ విజయోత్సవాలను సంవత్సరికంలా భావిస్తున్నారని, డిసెంబర్ నుండి ఈ అసత్యపు ప్రచారాన్ని తాము కూడా గ్రామ గ్రామాన ప్రజల సమక్షంలోనే సంవత్సరికంలా నిర్వహిస్తామని తెలిపారు.తెలంగాణా అనేక ఉద్యమాలలో కరీంనగర్ జిల్లాకు విజయాల చరిత్ర ఉందని, తెలంగాణ సాధించాలన్న గొప్ప లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 2001లో మొదటి సింహ గర్జన కరీంనగర్ నుండే ప్రారంభించారని,2009లో యూపిఏ ప్రభుత్వం తెలంగాణ ప్రకటన ఇచ్చి వెనుకకు తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర సాధనకు ఇదే నా చివరి పోరాటం కావాలనే సంకల్పంతో కరీంనగర్ గడ్డ నుండే కేసిఆర్ మళ్ళీ దీక్ష చేపట్టారని గాంధీజీ సత్యాగ్రహ దీక్ష ఎంత బలమైనదో కరీంనగర్ నుండి కేసిఆర్ చేపట్టిన దీక్ష కూడా అంతే బలమైనదిగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని, తెలంగాణ సాదించిన కేసిఆర్ కు కృతజ్ఞతా భావంతో ఈ నెల 29న అల్గునూర్ లో దీక్షా దివాస్ కార్యక్రమాన్ని బిఆర్ఎస్ ఏర్పాటు చేస్తుందని,ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ హాజరవుతారని కాబట్టి జిల్లాలోని బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని దీక్షా దివాస్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావు, పార్టీ మండలాద్యక్షుడు తాళ్ళపెళ్ళి శేఖర్ గౌడ్,మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సిద్దం వేణు, మాజీ సర్పంచ్ దేవ సత్తీష్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి శాతరాజు యాదగి ,బిఆర్ఎస్ సోషల్ మీడియా సదయ్యగౌడ్, నాయకులు పిట్టల మదు,కనకం అనీల్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !