హుజురాబాద్/డిసెంబర్05 (మా అక్షరం): మాదిగ ఐక్య సంక్షేమ సంఘం (మాస్) మాదిగ జాతి ఐక్యత అభివృద్ధి కోసం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల రెండవతారీకున మాదిగల ఐక్య సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో రాష్ట్ర వ్యవస్థపక అద్యక్షులు మిద్దెపాక రవిందర్ రాష్ట్ర కమిటీని ప్రకటించడం జరిగింది. ఈ రాష్ట్ర కమిటీ ఎన్నికల్లో హుజురాబాద్ ప్రాంతానికి చెందిన సినియర్ దళిత నాయకులైన రాం సారయ్య ను రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైనందునా ఈ సమావేశానికి ముఖ్యాతిథిగా హజరైన అప్పికట్ల భరత్ భుషన్ మాజీ రైల్వే అధికారి అదేవిధంగా ఇమ్మడీ విజయపాల్ రిటైర్డ్ ఓఎన్జిసి ఉద్యోగుల సంఘ మాజీ జాతీయ అధ్యక్షులు నియామకపత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ ఎన్నికకు సహకరించిన రాష్ట్ర దళిత నాయకులకు రాం సారయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాం సారయ్య మాట్లాడుతూ.. సంఘ బలోపేతానికి మరియు మాదిగ జాతి ఐక్యత కోసం కృషి చేస్తానని అన్నారు.











