+91 99635 77856

కోర్టు ఆదేశాల ప్రకారం మాకు న్యాయం చేయండి..

Kudikala Sai Editor
maaksharamnews.in

కోర్టు ఆదేశాల ప్రకారం మాకు న్యాయం చేయండి..

-విశ్వ ప్రగతి పాఠశాల యాజమాన్యం, గత ఎంఈఓ ఇబ్బందులకు గురి చేశారు..
-ఉన్నతాధికారులు వెంటనే సమస్య పరిష్కరించేలా చేయండి..
హుజురాబాద్/ డిసెంబర్ 09(మా అక్షరం): పట్టణం లోని గాంధీ నగర్ లో నడుస్తున్న విశ్వ ప్రగతి పాఠశాల యజమాన్యం తమని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని హుజురాబాద్ శ్రీ వెంకట సాయి ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు పులి అరవింద్ రెడ్డి ఆరోపించారు. సోమవారం హుజురాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... 2010లో ఏడుగురు సభ్యులం కలిసి వెంకట సాయి ఎడ్యుకేషనల్ సొసైటీ ఏర్పాటు చేసుకొని గ్రీన్ సెడ్జ్ పాఠశాలను ప్రారంభించామని, అప్పటి పాఠశాలకు ప్రిన్సిపాల్ గా కూడా వ్యవహరించానని అన్నారు. అనంతరం కరోనా సమయం వరకు పాఠశాల నడిపించామని, కరుణ సమయంలో రాష్ట్రమంతా లాక్ డౌన్ ఉండడంతో పాఠశాలను రెన్యువల్ పోయామని, అయినప్పటికీ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు రెన్యువల్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు.పోరెడ్డి శాంతన్ రెడ్డి, విశ్వప్రగతి ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడైన సంజీవరెడ్డి, అప్పటి ఎంఈఓ కే.శ్రీనివాస్ రెడ్డి ఒక పథకం ప్రకారం ఫేక్ ఆధారాలు సృష్టించి అప్పటివరకు నడుస్తున్న గ్రీన్ సెర్చ్ పాఠశాల పేరును మార్చి విశ్వ ప్రగతి పాఠశాలగా మార్చారని అన్నారు. దీనిపై కోర్టును ఆశ్రయించగా కోర్టు అన్ని ఆధారాలను సేకరించి వెంటనే పాఠశాలను మూసివేయాలని తీర్పునిచ్చిందని అన్నారు.తీర్పువచ్చి దాదాపు 50 రోజులు గడిచినప్పటికీ ఇప్పటివరకు పాఠశాలను మూసి వేయకపోవడంతో పలుమార్లు అధికారులను విజ్ఞప్తి చేశమని అన్నారు. ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి మమ్మల్ని ఇబ్బందికి గురిచేసిన పోరెడ్డి శాంతన్ రెడ్డి, విశ్వప్రగతి ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడైన సంజీవరెడ్డి పై కేసు నమోదు చేశామన్నారు. వెంటనే పాఠశాలను మూసివేయాలని అధికారులను కలవగా మరో 48 గంటల సమయం కోరారని అన్నారు. వెంటనే అధికారులు స్పందించి విశ్వ ప్రగతి పాఠశాల మూసివేయించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో పోతరాజు లక్ష్మణ్ పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

-విశ్వ ప్రగతి పాఠశాల యాజమాన్యం, గత ఎంఈఓ ఇబ్బందులకు గురి చేశారు..
-ఉన్నతాధికారులు వెంటనే సమస్య పరిష్కరించేలా చేయండి..
హుజురాబాద్/ డిసెంబర్ 09(మా అక్షరం): పట్టణం లోని గాంధీ నగర్ లో నడుస్తున్న విశ్వ ప్రగతి పాఠశాల యజమాన్యం తమని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని హుజురాబాద్ శ్రీ వెంకట సాయి ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు పులి అరవింద్ రెడ్డి ఆరోపించారు. సోమవారం హుజురాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… 2010లో ఏడుగురు సభ్యులం కలిసి వెంకట సాయి ఎడ్యుకేషనల్ సొసైటీ ఏర్పాటు చేసుకొని గ్రీన్ సెడ్జ్ పాఠశాలను ప్రారంభించామని, అప్పటి పాఠశాలకు ప్రిన్సిపాల్ గా కూడా వ్యవహరించానని అన్నారు. అనంతరం కరోనా సమయం వరకు పాఠశాల నడిపించామని, కరుణ సమయంలో రాష్ట్రమంతా లాక్ డౌన్ ఉండడంతో పాఠశాలను రెన్యువల్ పోయామని, అయినప్పటికీ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు రెన్యువల్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు.పోరెడ్డి శాంతన్ రెడ్డి, విశ్వప్రగతి ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడైన సంజీవరెడ్డి, అప్పటి ఎంఈఓ కే.శ్రీనివాస్ రెడ్డి ఒక పథకం ప్రకారం ఫేక్ ఆధారాలు సృష్టించి అప్పటివరకు నడుస్తున్న గ్రీన్ సెర్చ్ పాఠశాల పేరును మార్చి విశ్వ ప్రగతి పాఠశాలగా మార్చారని అన్నారు. దీనిపై కోర్టును ఆశ్రయించగా కోర్టు అన్ని ఆధారాలను సేకరించి వెంటనే పాఠశాలను మూసివేయాలని తీర్పునిచ్చిందని అన్నారు.తీర్పువచ్చి దాదాపు 50 రోజులు గడిచినప్పటికీ ఇప్పటివరకు పాఠశాలను మూసి వేయకపోవడంతో పలుమార్లు అధికారులను విజ్ఞప్తి చేశమని అన్నారు. ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి మమ్మల్ని ఇబ్బందికి గురిచేసిన పోరెడ్డి శాంతన్ రెడ్డి, విశ్వప్రగతి ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడైన సంజీవరెడ్డి పై కేసు నమోదు చేశామన్నారు. వెంటనే పాఠశాలను మూసివేయాలని అధికారులను కలవగా మరో 48 గంటల సమయం కోరారని అన్నారు. వెంటనే అధికారులు స్పందించి విశ్వ ప్రగతి పాఠశాల మూసివేయించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో పోతరాజు లక్ష్మణ్ పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !