– తిమ్మాపూర్ మండలవాసులకు చేరువలో 108 అంబులెన్స్ సేవలు…
– మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి..
కరీంనగర్,తిమ్మాపూర్/డిసెంబర్ 13 (మా అక్షరం):రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.తిమ్మాపూర్ మండల ప్రజలకు 108 అంబులెన్స్ సేవలు చేరువయ్యాయని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. తిమ్మాపూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మంజూరైన అంబులెన్స్ వాహనానికి ఎమ్మెల్యే పచ్చజెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ… పేద ప్రజలకు వైద్యం అందించడానికి రాష్ట్రవ్యాప్తంగా 250 నూతన అంబులెన్స్ వాహనాలను సమకూర్చిందన్నారు. అందులో భాగంగానే తిమ్మాపూర్ మండలానికి కూడా నూతన అంబులెన్స్ రావడం, ఈ వాహనంలో అన్ని రకాల అధునాతన సదుపాయాలు కలిగి ఉండటం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. 24 గంటలు అందుబాటులో ఉండే అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. అత్యవసర పరిస్థితులల్లో అందించే అంబులెన్స్ సేవలు రోగి ప్రాణాన్ని నిలుపుతాయన్నారు. అవసరమైనప్పుడు మాత్రమే 108 కు ఫోన్ చేయాలే తప్పా ఆకతాయి పనుల కోసం మాత్రం కాల్ చెయొద్దన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా నిరుపేద ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందించడానికి 10 లక్షల వరకు పొందగలిగే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందని ఆయన గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వెంకటరమణ, వైద్యులు డాక్టర్ అరుణ, డాక్టర్ కిరణ్, డాక్టర్ సాహితి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధగోని లక్ష్మినారాయణ గౌడ్, పార్టీ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాస్ రావు, ఎస్.కొండల్ రావు, కుంట రాజేందర్ రెడ్డి, బుధారపు శ్రీనివాస్, పోలు రాము, పోలు రమేశ్, ముస్కుల లక్ష్మారెడ్డి, నగునూరి శ్రీనివాస్, బుర్ర వంశీ,తాళ్ల కిరణ్, దొనపాటి మధుసూదన్ రెడ్డి, ఎన్.మహేశ్, చిలుకూరు అనిల్, పైడిపల్లి స్వామి తోపాటు అంబులెన్స్ సిబ్బంది, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.











