కరీంనగర్, తిమ్మాపూర్ డిసెంబర్ 17 (మా అక్షరం):కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట టోల్ ప్లాజా వద్ద గ్రామపంచాయతిల సిబ్బంది మంగళవారం చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలో తిమ్మాపూర్ పోలీసులు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించగా సిబ్బందికి సిపిఐ,ఏఐటీయూసీ నాయకులు మద్దతు తెలిపారు.అనంతరం నాయకులు బోయిని తిరుపతి మాట్లాడుతూ ….ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ప్రకారం గ్రామపంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేసి ఒకటవ పిఆర్సి బేసిక్ వేతనం 19,500 అమలు చేయాలని ఈలోపు జీవో60 ప్రకారం ప్రతి సిబ్బందికి 15,600 వేతనాన్ని ట్రెజరీ ద్వారా చెల్లించి, జీవో 51లో మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేసి పాత కేటగిరీలు యధావిధిగా కొనసాగించాలన్నారు.విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన సిబ్బంది కుటుంబానికి 10లక్షల నష్టపరిహారం, దహన సంస్కారానికి 30,000 ఆర్థిక సహాయాన్ని అందించి, కార్మికులకు సమాన వేతనాలు, ప్రమాద బీమా గ్రావిటీ, ప్రభుత్వ గుర్తింపు కార్డులు, వారాంతపు, పండుగ, జాతీయ ఆర్జిత సెలవు దినాలను అమలు చేసి,ట్రాక్టర్ డ్రైవర్లకు పంచాయతీ ద్వారానే డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పించాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల శ్రీనివాస్, తెలంగాణ గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు నారదాసు ఆగం రావు, అధ్యక్షులు బుడిగే అంజయ్య, ఉపాధ్యక్షులు పప్పు శ్రీనివాస్, కోశాధికారి పాఠకుల అంజయ్య, పంచాయతీ సిబ్బంది గోదారి శ్రీనివాస్, గాజుల కుమారస్వామి, దుర్గం శంకర్, డప్పు రామచంద్రం, ఉప్పులేటి అంజయ్య, బరిగెల మల్లవ్వ, గడ్డం లచ్చవ్వ, స్రవంతి పాల్గొన్నారు.











