+91 99635 77856

ప్రభుత్వ కళాశాలలో రంగోలి ఉత్సవాలు..

హుజురాబాద్/జనవరి10(మా అక్షరం): పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థినులకు ముగ్గుల పోటీ, విద్యార్థులకు పతంగుల ఎగురవేత పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విజేతలను ఎంపిక చేయడానికి హుజురాబాద్ పట్టణం మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి. గందే.రాధిక – శ్రీనివాస్,ఒకటవ వార్డ్ కౌన్సిలర్ శ్రీమతి రమాదేవి విచ్చేసి ప్రథమ, ద్వితీయ,తృతీయ బహుమతులను ఎంపిక చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భముగా చైర్ పర్సన్ మాట్లాడుతూ.. అమ్మాయిలు ఈ సమాజంలో సగభాగం కావున మీరు మంచిగా చదువుకొని ఉన్నత స్థానంలో నిలవాలని,అబ్బాయిలు మీరు కూడా శ్రద్ధగా చదువుకొని మీ అమ్మా నాన్న లకు,ఈ దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని అన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ వి.అంజనేయరావు మాట్లాడుతూ మీరు కళాశాలకు రావడం,మా విద్యార్థులకు సూచనలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు,అంతే కాకుండా కళాశాలలో చెడిపోయిన బోరు బావి కి కొత్త మోటార్, పైపు లను మేము అడిగినవెంటనే మా కళాశాలకు అందచేసినందుకు ధన్యవాదములు తెలుపుతూ చైర్ పర్సన్ గoదే.రాధిక,1 వ వార్డ్ కౌన్సిలర్ రమాదేవి ని మహిళా అధ్యాపకులు చే ఘనముగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో కళాశాల ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్. కె .సుగుణ,మహిళా అధ్యాపకులురేణుకా,శైలజ,సుహాసిని,రజిత,రజనీ,జ్యోతి, వనమాల ,అధ్యాపకులు ప్రసాద్, విజేందర్ రెడ్డి,బండి.రాజశేఖర్,విద్యార్థిని విద్యార్థులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !