తిమ్మాపూర్/జనవరి 14 (మా అక్షరం):కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లిలో సంక్రాంతి పండుగ సందర్భంగా క్రీడా ఫోటీలు నిర్వహించారు.చిన్న పెద్దా తేడా లేకుండా నాలుగు టీములను ఏర్పాటు చేసి ఆడిన క్రికెట్ ఆటలో మొదటి,రెండో ఆటల్లో గెలిచిన జట్లు చివరగా పోటీ పడగా కర్ర మణికంఠ జట్టు విజయం సాధించారు.గెలిచిన జట్టుకు కప్పును, ఓడిన జట్టుకు రన్నర్ కప్పుతో పాటు నగదు ప్రోత్సాహాన్ని గొల్లపల్లి మాజీ సర్పంచ్ మల్లెత్తుల అంజయ్య అందజేశారు. గ్రామ సీనియర్ క్రీడాకారులు మాజీ ఉపసర్పంచ్ కానుగంటి సత్యనారాయణ రెడ్డి, పింగళి నరేందర్ రెడ్డి, వెన్నం చంద్రశేఖర్ రెడ్డి, బుట్ల శ్రీనివాస్, కానుగంటి మధుకర్ రెడ్డి,కొమ్మెర సతీష్ రెడ్డి యువకులను ఉత్తేజ పరచడం కోసం ప్రైజ్ మనీనీ, సిక్స్ కొట్టిన బ్యాట్స్ మ్యాన్ జంగా రవీందర్ రెడ్డికి ప్రత్యేక నగదు ప్రధానం చేశారు.గ్రామంలో నిర్వహించిన క్రికెట్ ఆటను గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై ఆసక్తిగా తిలకించారు..











