+91 99635 77856

ఎస్సి హాస్టల్ సందర్శించిన బీజేపీ నాయకులు

హుజురాబాద్/జనవరి 25(మా అక్షరం): భారతీయ జనతా పార్టీ హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు ఆధ్వర్యంలో సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని ఎస్సీ హాస్టల్ సందర్శించి స్థితిగతులను తెలుసుకున్నారు.వంట, మెనూ వసతి నీ పరిశీలించారు. హాస్టల్ యువకులతో మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని తెలియజేశారు. బ్రిటిష్ పరిపాలన కాలంలో గొప్ప చదువులు చదివి ప్రపంచ మేధావిగా పేరు సంపాదించుకున్న మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. వారి ఆశయ సాధనకు ప్రతి కంకణ బద్దులు కావాలని కోరారు.భారత రాజ్యాంగం వర్తమానం, భవిష్యత్తుకు మార్గదర్శి అని ప్రతి పౌరుడు ఏకైక లక్ష్యం అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మించడమే కావాలని ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ లో కోరారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు, కోఆర్డినేటర్ బోరగాల సారయ్య,సీనియర్ నాయకులు గంగిశెట్టి ప్రభాకర్, యాంశాని శశిధర్, నరాల రాజశేఖర్, తిప్పబతిని రాజు, అంకతి వాసు, గుర్రం సంతోష్, రాపాక రాజు, కొడిమ్యాల పవన్, కుసుమ సమ్మయ్య, నీలం రవీందర్, తూర్పాటి రాంచంద్రం, పర్ధం రాము, అనిల్, తూర్పాటి సాయి, తూర్పాటి సునీల్, గంధం సంతోష్, పర్థం సాయి, ఎండీ ఫరాన్, పురాణం రాజు తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !