+91 99635 77856

ఘనంగా గద్దర్ జయంతి…

Kudikala Sai Editor
maaksharamnews.in

ఘనంగా గద్దర్ జయంతి…

హుజురాబాద్/జనవరి 31(మా అక్షరం):ప్రజా యుద్ధనౌక ప్రజా గాయకులు గద్దర్ 77 వ జయంతి కార్యక్రమం శుక్రవారం సాయంత్రం అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ప్రజా కళాకారులు శనిగరపు బాబ్జి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ..

సమ సమాజ స్థాపన కోసం పీడిత ప్రజల అభివృద్ధి కోసం అసమానతలు లేని సమాజం కోసం ప్రత్యేక తెలంగాణ సాధన కోసం కృషి చేసిన గద్దర్ ఆశయాలను కొనసాగించాలని కోరారు. ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందిన గద్దర్ రచనలు,ఆట,పాటలు సమాజం ఉన్నంతవరకు ఉంటాయని అన్నారు. నిమ్నజాతుల అభివృద్ధి కోసం తన ఆటపాటను అంకితం చేసి జీవితాన్నే త్యాగం చేసిన గద్దర్ సేవలను వారు కొనియాడారు.ఈకార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, ప్రముఖ న్యాయవాది ముక్కెర రాజు, సామాజిక కార్యకర్త రవీందర్రావు, ప్రజా సంఘాల నాయకులు రొంటాల బాబు ,మార్త రవీందర్, జర్నలిస్టులు కాయిత రాములు, ఆంజనేయస్వామి, పోతరాజు సంపత్, మాడుగుల ఓదెలు, తునికి సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !