+91 99635 77856

వినతి పత్రం అందజేత…

హుజురాబాద్/ఫిబ్రవరి08(మా అక్షరం): ఇటీవల హుజరాబాద్ కు బదిలీపై నూతనంగా వచ్చిన కమిషనర్ కె.సమ్మయ్యను అంబేడ్కర్ పూలే జయంతి కమిటీ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు శనివారం గౌరవంగా కలిసి సన్మానించారు.అనంతరం నాయకులు మాట్లాడుతూ.. హుజురాబాద్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని గతంలో దళిత సంఘాల నాయకులు,ఉద్యోగులు కలిసి ఏర్పాటు చేశారని కానీ నేడు అంబేద్కర్ విగ్రహం చుట్టూ వివిధ రాజకీయ పార్టీల జెండాలు, తోరణాలు కట్టి అంబేద్కర్ కున్న స్ఫూర్తికి భంగం కలిగిస్తూ అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఇక ముందు ఏ రాజకీయ పార్టీ కూడా జెండాలు కట్టకుండా నియంత్రించి అంబేద్కర్ పవిత్రతను పరిరక్షించాలని కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ జయంతి కమిటీ చైర్మన్ ఖాలీద్ హుస్సేన్, జ్యోతిరావు పూలే జయంతి కమిటీ చైర్మన్ ఉప్పు శ్రీనివాస్, లోక్ సత్తా నాయకులు గూడూరు స్వామి రెడ్డి, ఆకినపల్లి రమేష్, ప్రజాసంఘాల నాయకులు వేల్పుల రత్నం, తులసి లక్షణమూర్తి, డాక్టర్ తడికమళ్ళ శేఖర్, బండ లక్ష్మారెడ్డి (చెల్పూర్) , మొలుగూరి మొగిలయ్య (చెల్పూర్) వేల్పుల ప్రభాకర్, చందు తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !