హుజరాబాద్/ ఫిబ్రవరి 09(మా అక్షరం): పట్టణంలోని ఏక్ మినార్ మసీదుకు ఆదివారం హుజరాబాద్ జామి మజీద్ ఈద్గా ,కబ్రస్థాన్ మేనేజ్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించగా మొహమ్మద్ జలాలుద్దీన్ అక్బర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా హుజరాబాద్ జామి మజీద్ ఈద్గా ,కబ్రస్థాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ముస్లింలను ఉద్దేశించి మాట్లాడుతూ… ముస్లింలందరూ ఐక్యంగా ఉండాలని అందరూ ఐక్యంగా ఉంటే ఈ కార్యవర్గానికి ఎన్నుకున్నట్లయితే ఏక్ మినార్ మజీద్ అభివృద్ధి కొరకు అందరు కృషి చేసిన వారు అవుతారు కనుక గతం నుండి ఇప్పటివరకు ఏక్ మినార్ మజీద్ అధ్యక్షులుగా మహమ్మద్ జలాలుద్దీన్ అక్బర్ ఇప్పటివరకు మజీద్ అభివృద్ధి కొరకు ఎంతో కృషి చేసినారు కనుక పోటా పోటీ లేకుండా అందరూ ఒకటై ప్రశాంత వాతావరణంలో హుజరాబాద్ ఏక్ మినార్ మజీద్ నూతన కార్యవర్గానికి అందరూ సహకరించాలని ముస్లిం సోదరులందరికీ విజ్ఞప్తి చేయగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అందరూ కలిసి ఎనిమినార్ మజీద్ నూతన కార్యవర్గానికి ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి అభిప్రాయం తెలియజేశారు. అందువలన ఆదివారం రోజు మధ్యాహ్నం అందరి అభిప్రాయం ప్రకారం నూతనముగా 2025 నుండి 2028 వరకు రెండు సంవత్సరాల కొరకు నూతన కార్యవర్గానికి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఏక్ మినర్ అధ్యక్షులు :- మొహమ్మద్ జలాలుద్దీన్ అక్బర్ కార్యదర్శి:-ఎండీ హుస్సేన్ కోశాధికారి:- మొహమ్మద్ నవాఖాన్ ఉపాధ్యక్షులు:- సయ్యద్ అంకుష్ మహమ్మద్ మతి హైమత్ ఖాన్. మహమ్మద్ హుస్సేన్. మీర్జా ఆఫ్జాల్. మహమ్మద్ రామీజ్ అహ్మద్ ఖాన్. షేక్ ఖాజా పాషా . మీర్జా జియా బే. కార్యవర్గ సభ్యులు :- మొహమ్మద్ దులేపాషా. షేక్ అజ్జు. మొహమ్మద్ ముబారక్. మొహమ్మద్ సల్మాన్. ఎండి ఖాజా పాషా. అక్బర్ హుస్సేన్. సయ్యద్ అన్వర్. మొహమ్మద్ నవాజ్ ఖాన్. షేక్ వసీమ్. మహమ్మద్ సమీర్. మహమ్మద్ షహెల్. మొహమ్మద్ తాజ్. తదితరులు పాల్గొన్నారు











