+91 99635 77856

తెలంగాణ ఆల్ పెన్షనర్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఘన సన్మానం

హుజురాబాద్/ ఫిబ్రవరి 10(మా అక్షరం): హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా ఇటీవల బాధ్యతలు తీసుకున్న కె.సమ్మయ్య కు సోమవారం తెలంగాణ ఆల్ పెన్షనర్,రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ హుజురాబాద్ శాఖ అధ్యక్షులు శనిగరం నరేందర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టా ప్ర కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ.. ఒకనాట తమ ఉపాధ్యాయ మిత్రుడు నేడు హుజురాబాద్ పట్టణానికి కమిషనర్ గా రావడం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పట్టణంలో నీటి సరఫరా పారిశుద్ధ్యము వీధి దీపాలు రోడ్ల నిర్వహణ ప్రజా సమస్యల పట్ల తగిన శ్రద్ధ వహిస్తూ పట్టణాభివృద్ధికి తన వంతు కృషి చేయాలని కోరారు. స్వచ్ఛభారత్ లో భాగంగా హుజురాబాద్ మున్సిపాలిటీ నంబర్ వన్ ర్యాంకు సాధించుటకు నిరంతరం వృత్తిపట్ల తన ధర్మాన్ని పాటించి ఒక మంచి ఆదర్శ మున్సిపల్ కమిషనర్ గా పేరుపొందాలని ఆకాంక్షించారు. అదేవిధంగా హుజూరాబాద్ పట్టణంలోని కరీంనగర్ రహదారి ప్రభుత్వ కళాశాల మూలమలుపు వద్ద యాక్సిడెంట్స్ జరుగుతున్నందున రోడ్డుపై బ్రేకర్స్ వేయించి ఇండికేటర్స్ ఏర్పాటు చేస్తూ ఇక ముందు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన శ్రద్ధ వహించాలని కమిషనర్ను కోరగా కమిషనర్ స్పందిస్తూ మీ సూచనలు సలహాలు పాటిస్తూ పట్టణ అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయము మేనేజర్ రావుల భూపతిరెడ్డి, హనుమాన్ దేవాలయం కమిటీ మాజీ చైర్మన్ ఆకుల సదానందం, జిల్లా ఉపాధ్యక్షులు బొంగోని వెంకటయ్య, సయ్యద్ మునురుద్దీన్, రావి కంటి రామకృష్ణయ్య, హుజురాబాద్ శాఖ ప్రధాన కార్యదర్శి చీకట్ల సమ్మయ్య, టా ప్ర నాయకులు తాటిపాముల కనకయ్య, గంగిశెట్టి సాంబయ్య, తౌటం శ్రీహరి, వేల్పుల భాస్కర్, గాజర్ల బుచ్చి రాజం, ముక్కెర మొగిలి, గూడూరి మల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !