+91 99635 77856

సోలార్ పవర్ వినియోగానికి కేంద్రం ప్రోత్సాహం

Kudikala Sai Editor
maaksharamnews.in

సోలార్ పవర్ వినియోగానికి కేంద్రం ప్రోత్సాహం

-హుజురాబాద్ లో సోలార్ పవర్ ఏజెన్సీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్...
-గ్రామీణ ప్రాంతాల్లో సోలార్ పై అవగాహన పెంచాలి ..
హుజురాబాద్/ఫిబ్రవరి 23 (మా అక్షరం):గ్రామీణ ప్రాంతాల్లో సోలార్ పవర్ వినియోగములోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తున్నదని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.ఆదివారం హుజురాబాద్ ని డిసిఎం ఎస్ కాంప్లెక్స్ లో స్థానిక బీజేపీ నేత ఏర్పాటు చేసిన సోలార్ ఏజెన్సీ కార్యాలయాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... సౌర శక్తి ని వినియోగంలోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సోలార్ ప్రాజెక్ట్ లకు సబ్సిడీ ఇస్తున్నదని చెప్పారు.గ్రామీణ ప్రాంతాల్లో సోలార్ పవర్ ను ఉపయోగించుకోవాలని ఈ విషయములో అందరు అవగాహన పెంచుకోవాలని కోరారు.ఈ కార్యక్రమములో శివ బాలాజీ సోలార్ ఏజెన్సీ నిర్వాహకులు కోటేశ్వర రావు, బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, బిజెపి పట్టణ, మండల అధ్యక్షులు, బిజెపి కార్యకర్తలు, మాజీ మున్సిపల్ చెర్మన్ గందె రాధికా తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

-హుజురాబాద్ లో సోలార్ పవర్ ఏజెన్సీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్…
-గ్రామీణ ప్రాంతాల్లో సోలార్ పై అవగాహన పెంచాలి ..
హుజురాబాద్/ఫిబ్రవరి 23 (మా అక్షరం):గ్రామీణ ప్రాంతాల్లో సోలార్ పవర్ వినియోగములోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తున్నదని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.ఆదివారం హుజురాబాద్ ని డిసిఎం ఎస్ కాంప్లెక్స్ లో స్థానిక బీజేపీ నేత ఏర్పాటు చేసిన సోలార్ ఏజెన్సీ కార్యాలయాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… సౌర శక్తి ని వినియోగంలోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సోలార్ ప్రాజెక్ట్ లకు సబ్సిడీ ఇస్తున్నదని చెప్పారు.గ్రామీణ ప్రాంతాల్లో సోలార్ పవర్ ను ఉపయోగించుకోవాలని ఈ విషయములో అందరు అవగాహన పెంచుకోవాలని కోరారు.ఈ కార్యక్రమములో శివ బాలాజీ సోలార్ ఏజెన్సీ నిర్వాహకులు కోటేశ్వర రావు, బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, బిజెపి పట్టణ, మండల అధ్యక్షులు, బిజెపి కార్యకర్తలు, మాజీ మున్సిపల్ చెర్మన్ గందె రాధికా తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !