+91 99635 77856

పశుపతినాథ్ స్వామి ఆలయంలో మాహా శివరాత్రి ప్రత్యేక పూజలు….

నిర్వహించిన ఆలయ ప్రధాన అర్చకులు సదా నిరంజన్ సిద్ధాంతి…

ఎల్కతుర్తి/ఫిబ్రవరి 26 (మా అక్షరం):

మండలంలోని వల్బాపూర్ గ్రామంలో బుధవారం రోజున ఉదయం 6 గంటల నుండి శ్రీ పశుపతినాథ్ స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివాలయంలో హట్టహాసంగా పూజ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అఖండ దీపారాధన ధ్వజారోహణం పుణ్యాహావాచనం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ విఘ్నేశ్వర స్వామికి పంచామృత అభిషేకం, శ్రీ గౌరీదేవి అమ్మవారికి అభిషేకము, కుంకుమ పూజ, నందీశ్వరునికి అభిషేక పూజ, శ్రీ పశుపతినాథ్ స్వామివారికి పంచామృత సహిత, రుద్రాభిషేకలు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకునీ తీర్త ప్రసాదాలు తీసుకున్నారు. ఆ మహా శివుని ఆశీస్సులతో రాష్ట్రం అంతా మంచి వర్షాలతో, పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ సదానిరంజన్ సిద్ధాంతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పోల్నేని రామారావు, పొనగంటి శ్రావణ్ రావు,పోల్నేని రవీందర్ రావు, ఎర్రబెల్లి సంపత్ రావు, రాయబరపు అనంత రాములు,అంబాల రంజిత్, అంబాలా నవీన్, సుదర్శన్, చిర్ర మహేందర్, చిర్ర శ్యాంసుందర్, దశ్రు, లక్కీ, తరుణ్, ఠాగూర్, తదితర భక్తులు గ్రామస్థులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !