+91 99635 77856

వి.ఎస్.ఆర్ డిగ్రీ కళాశాలలో క్యాంపస్ ప్లేసెమెంట్ డ్రైవ్

-ఉద్యోగాలకు ఎంపికైన 35 మంది విద్యార్థులు…
-అభినందించిన కళాశాల యాజమాన్యం..

హుజురాబాద్ /ఫిబ్రవరి25(మా అక్షరం): హుజురాబాద్ మండలం సింగాపురంలోని వి.ఎస్.ఆర్ డిగ్రీ కళాశాలలో మంగళవారం క్యాంపస్ ఇంటర్వ్యూలు జరిగాయి. వి. ప్రాసెస్ మల్టిపుల్ కెరియర్ సర్వీసెస్, యాక్సిస్ బ్యాంక్, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్, ఫీన్ వర్స్ , ఎస్ ఎస్ ప్లస్, ఐటీ సొల్యూషన్స్ , ఫిన్వర్జ్ కంపనీల ఎచ్. ఆర్. మేనేజర్లు కందుకూరి సత్యనారాయణ, కొరిమి పీతాంబర్, వినయ్ తదితరులు రాత పరీక్ష ఇంటర్వూలు నిర్వహించారు. ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కు కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న 82 మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా ఇందులో 35 మంది విద్యార్థులను ఉద్యోగాల నిమిత్తం కంపెనీలు ఎంపిక చేసుకున్నాయి. ఉద్యోగులకు ఎంపికైన విద్యార్థులను వి ఎస్ ఆర్ డిగ్రీ కళాశాల సెక్రటరీ, మాజీ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వొడితల ఇంద్రనీల్, ప్రిన్సిపాల్ వి.వి.ఎన్. హనుమకుమార్ తదితరులు అభినందించారు. ఈ కార్యక్రమంలో వి. ఎస్ ఆర్ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శనిగరపు రజిత, ప్లేస్మెంట్స్ ఆఫీసర్ తాళ్ళపల్లి అజయ్ కుమార్, సీనియర్ అసస్టెంట్ పొతిరెడ్డి హరీష్, భాస్కర్, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !