+91 99635 77856

అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు

-డాక్టర్.ఎన్ రమేష్…
-హాస్పటల్ మహిళ సిబ్బంది తో కేక్ కటింగ్…

హుజురాబాద్/ మార్చి 08(మా అక్షరం):పట్టణంలోని ఎన్ రమేష్ హాస్పిటల్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం డాక్టర్.ఎన్.రమేష్ హాస్పిటల్ లో సిబ్బందితో కేక్ కట్ చేయించారు అనంతరం ఆయన మాట్లాడుతూ.. సృష్టికి మూలం మహిళ ఆమె శక్తియుక్తులు అపారం, ఆమె ఓప్రేరణ, ఓలాలన, శ్రీ లేకుంటే ఈ సృష్టి లేదు. దానికి గమ్యం, గమనం లేదు.. మనిషికి జీవం, జీవితమే లేదు.. శ్రీ లేకుంటే అంతా శూన్యం అని అన్నారు. అందుకే స్త్రీలకు శతకోటి వందనాలు, అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ చరిత్ర సృష్టిస్తున్నారు. అవకాశాలు రాకపోయినా, అవమానాలు ఎదురైనా.. ఎవరో వచ్చి సాయం చేస్తారని ఎదురు చూడడం లేదు. ఆకాశం, అవకాశాల్లో సగంగా అంటూ, ముందంజలో దూసుకుపోతున్న స్త్రీమూర్తులెందరో వంట గదికే ఆమెను అంకితం చేద్దామని చూస్తే అంతరిక్షంలో దూసుకెళ్లింది. వాకిలి దాటొద్దని ఆంక్షలు పెడితే ఆవలి హద్దులు దాటి అవనిని జయించింది. అణచివేత నుంచి ఆత్మ విశ్వాసం వైపు పయనించింది అని అన్నారు. వంటింటి నుంచి విశ్వానికి ఎదిగింది. ఆమె ప్రస్థానం అంతా ఇంతా కాదు.. ఏ రంగమైనా నేనే మేటి అని నిరూపించిన తెగువ, తెలివి స్త్రీలది అన్నారు. నేడు ఆమె పండుగ అదే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని డాక్టర్.రమేష్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !