+91 99635 77856

ఇంటి పన్నుల వసూళ్ల లో మొదటి స్థానంలో హుజురాబాద్ మున్సిపాలిటీ

హుజురాబాద్/మార్చి 19 (మా అక్షరం): మున్సిపాలిటీ ఇంటి పన్నుల వసూళ్ళ లో హుజురాబాద్ మున్సిపాలిటీ మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఆర్ధిక సం రముకు గాను 100 శాతం ఇంటి పన్నులు వసూళ్ళ చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. రాష్ర్టంలో 143 మున్సిపాలిటీ లు ఉండగా హుజురాబాద్ మొదటి స్థానంలో ఉండడడం గర్హనీయం. మున్సిపాలిటీ లోని 30 వార్డుల్లో 8917 నివాసాలు ఉండగా రూ.2 కోట్ల 64 లక్షల బకాయిలు ఉన్నాయి. గత రెండు నెలల క్రితం బదిలీ పై వచ్చిన సమ్మయ్య చొరవతో సిబ్బంది స్పెషల్ డ్రైవ్ చేపట్టి 100 శాతం ఇంటి పన్నులు వసూళ్లు చేయడం లో సఫలీకృతం అయ్యారు. 8917 నివాసాల కు గాను రూ.2 కోట్ల 64 లక్షలు వసూళ్ళు అయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాల ద్వారా పోలీస్ శాఖ నుండి రూ.5 లక్షల 41 వేలు, కోర్టు బిల్డింగ్ ల ద్వారా రూ.3 లక్షల 80 వేలు, ఎంపిడివో కార్యాలయం ద్వారా రూ.1 లక్షల18 వేలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా రూ.1 లక్ష 18 వేలు, చెల్లింపు లు జరిగాయి. వంద శాతం పన్నులు వసూళ్ళు జరిగిందున, 15 వ ఆర్ధిక సంఘం నుండి కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులు సత్వరమే వచ్చే అవకాశం ఉందని కమిషనర్ సమ్మయ్య తెలిపారు. పట్టణ ప్రజలు 100 శాతం పన్నులు చెల్లించి మున్సిపాలిటీ సిబ్బందికి సహకరించినందున కృతజ్ఞతలు తెలిపారు.

థై బజార్ కు రూ.16 లక్షల 40 వేలు
హుజురాబాద్ మున్సిపల్ లో థై బజార్ బహిరంగ వేలం ద్వారా రూ.16 లక్షల 40 వేలు వేలం పాట ద్వారా నిధులు వచ్చినట్లు కమిషనర్ సమ్మయ్య తెలిపారు. బహిరంగ వేలంలో 5 గురు వ్యక్తులు పాల్గొనగా రామకృష్ణ అనే అతనికి వేలం ద్వారా పాట లో చేజిక్కించు కొన్నారు. గత సం రూ.15 లక్షల 55 వేలు రాగ ఈ సం రము, రూ.16 లక్షల 40 వేలు వచ్చాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !