-భగత్ సింగ్ జయంతి వర్ధంతిని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలి..
-ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్…
హుజూరాబాద్/ మార్చి 23 (మా అక్షరం): పట్టణ కేంద్రంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) అధ్వర్యంలోభగత్ సింగ్ 94వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం ఎఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వేంకటేష్ మాట్లాడుతూ… దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటీష్ ముష్కరులను ఎదిరించి ప్రాణాలను అర్పించిన మహనీయులు భగత్ సింగ్ అని కొనియాడారు. ఆయన చూపిన బాటలో యువత నడుచుకుని, ఆయన ఆశించిన నవభారతావని కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. దేశం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్ కు భారతరత్న బిరుదునివ్వడంతో పాటు హైదరాబాద్ లోని ట్యాంకుబండ్ పై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే భగత్ సింగ్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కేశబోయిన రాముయాదవ్, మండల అధ్యక్ష, కార్యదర్శులు దొమ్మాటి వేణుగోపాల్,రాంపెల్లి రోహిత్, నాయకులు వంశీ, రాజు, మణి, అజేయ్ తదితరులు పాల్గొన్నారు..











