+91 99635 77856

వరల్డ్ టిబి డే సందర్భంగా హుజూరాబాద్ లో అవగాహన ర్యాలీ..

Kudikala Sai Editor
maaksharamnews.in

వరల్డ్ టిబి డే సందర్భంగా హుజూరాబాద్ లో అవగాహన ర్యాలీ..

హుజూరాబాద్/ మార్చి 24 (మా అక్షరం): వరల్డ్ టిబి డే ను పురస్కరించుకొని హుజూరాబాద్ లో అవగాహన కార్యక్రమాలు సోమవారం ఘనంగా నిర్వహించారు .ఏరియా హాస్పిటల్ హుజూరాబాద్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చెల్పుర్ సంయుక్త ఆధ్వర్యంలో హుజూరాబాద్ ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించడంతో పాటు అవగాహన సదస్సులను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్ ఎం ఓ Dr. సుధాకర్ రావు మాట్లాడుతూ... "క్షయ వ్యాధి గూర్చి భయపడాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా నయం అయ్యే వ్యాధి. సరైన విధంగా పూర్తి కోర్సు మందులు వాడితే పూర్తిగా స్వస్థత పొందవచ్చు" అని పేర్కొన్నారు. అలాగే, ప్రభుత్వం ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఉచిత పరీక్షలు, ఉచిత మందులతో పాటు పోషకాహార నిమిత్తం ప్రతి నెల మందులు వాడే వారికి రూ.1000 అందజేస్తున్నట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో Dr. మధుకర్ (మెడికల్ ఆఫీసర్, చెల్పుర్), Dr. జరీన్ (MLHP చెల్పుర్), పంజాల ప్రతాప్ (హెల్త్ ఎడ్యుకేటర్), విజేందర్ రెడ్డి (MPHEO), సమ్మయ్య (సూపర్వైజర్) తదితరులు పాల్గొన్నారు. టిబి విభాగం నుంచి శ్రీనివాస్ రెడ్డి, కిరణ్, దేవేందర్ రెడ్డి, నిషాంత్, సుజాత (ICTC), గీతాంజలి (NGO)లు తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

హుజూరాబాద్/ మార్చి 24 (మా అక్షరం): వరల్డ్ టిబి డే ను పురస్కరించుకొని హుజూరాబాద్ లో అవగాహన కార్యక్రమాలు సోమవారం ఘనంగా నిర్వహించారు .ఏరియా హాస్పిటల్ హుజూరాబాద్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చెల్పుర్ సంయుక్త ఆధ్వర్యంలో హుజూరాబాద్ ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించడంతో పాటు అవగాహన సదస్సులను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్ ఎం ఓ Dr. సుధాకర్ రావు మాట్లాడుతూ… “క్షయ వ్యాధి గూర్చి భయపడాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా నయం అయ్యే వ్యాధి. సరైన విధంగా పూర్తి కోర్సు మందులు వాడితే పూర్తిగా స్వస్థత పొందవచ్చు” అని పేర్కొన్నారు. అలాగే, ప్రభుత్వం ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఉచిత పరీక్షలు, ఉచిత మందులతో పాటు పోషకాహార నిమిత్తం ప్రతి నెల మందులు వాడే వారికి రూ.1000 అందజేస్తున్నట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో Dr. మధుకర్ (మెడికల్ ఆఫీసర్, చెల్పుర్), Dr. జరీన్ (MLHP చెల్పుర్), పంజాల ప్రతాప్ (హెల్త్ ఎడ్యుకేటర్), విజేందర్ రెడ్డి (MPHEO), సమ్మయ్య (సూపర్వైజర్) తదితరులు పాల్గొన్నారు. టిబి విభాగం నుంచి శ్రీనివాస్ రెడ్డి, కిరణ్, దేవేందర్ రెడ్డి, నిషాంత్, సుజాత (ICTC), గీతాంజలి (NGO)లు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !