+91 99635 77856

తెలుగు యుగాది కాల సూచికల క్యాలెండర్ను ఆవిష్కరణ…

దేవదాయ ధర్మదాయ శాఖ రాష్ట్ర మంత్రివర్యులు కొండ సురేఖ…

ఎల్కతుర్తి/మార్చి 23 (మా అక్షరం)

దేవాదాయ ధర్మాదాయ శాఖ రాష్ట్ర మంత్రివర్యులు కొండ సురేఖ చేతుల మీదగా ఆదివారం ఉదయం 11 గంటలకు త్రైత సిద్ధాంత భగవద్గీత విశ్వావసు నామ సంవత్సర కాలసూచికలు తెలుగు యుగాది క్యాలెండర్ ను వారి నివాసం హైదరాబాద్ నందు వారి స్వగృహం లొ ఆవిష్కరించారు. ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ గ్రామానికి చెందిన శ్రీ పశుపతినాథ్ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు, దూప దీప నైవేద్య సంఘం హన్మకొండ జిల్లా కార్యదర్శి, ఎల్కతుర్తి మండల అధ్యక్షులు త్రైత సిద్ధాంత ప్రబోధా సేవ సమితి హిందూ జ్ఞాన వేదిక ఎల్కతుర్తి కమిటీ అధ్యక్షులు సదానిరంజన్ సిద్ధాంతి. యుగాది కాలసూచిక క్యాలెండర్ (త్రైత శకం-47) ను పంపిణీ చేశారు. అనంతరం సిద్ధాంతి మాట్లాడుతూ… ఆత్మజ్ఞానం తెలుగు పండుగల విశిష్టత మరియు తెలుగు నెలల విశిష్టత త్రైత సిద్ధాంత భగవద్గీత శ్లోకముల సారంతో పాటు ప్రతి సమస్యకు పరిష్కార మార్గాలు ఉన్న భగవద్గీత యొక్క సారాంశం ఇందులో పొందుపరచి స్వామి వారు రచించడం జరిగిందన్నారు. మంత్రివర్యులు కొండ సురేఖ ఎంతో ఆసక్తిగా కాలసూచికలో విషయాలను అడిగి తెలుసుకుని తెలుగు భాష కనుమరుగైపోతున్నటువంటి సమయంలో స్వచ్ఛమైన తెలుగు భాషలో ఈ కాలసూచికలో అందించిన స్వామివారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎల్కతుర్తి కమిటీ అధ్యక్షులు శ్రీ సదానిరంజన్ సిద్ధాంతి, తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !