+91 99635 77856

హిందూ ధర్మాన్ని ఆచరించాలి…

త్రైత సిద్ధాంత విశ్వావసు నామ సంవత్సరం త్రైత శకం 47వ క్యాలెండర్ల ఆవిష్కరణ…

ఆవిష్కరిస్తున్న తెలంగాణ రాష్ట్ర రవాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్…

ఎల్కతుర్తి /మార్చి 30 [మా అక్షరం]

మండలంలోని వల్భాపూర్ శ్రీ పశుపతినాథ్ స్వామి దేవస్థానం ఆలయ అర్చకులు సదా నిరంజన్ సిద్ధాంతి త్రైత సిద్ధాంత ప్రబోధా సేవ సమితి ఎల్కతుర్తి కమిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో త్రైత సిద్ధాంత విశ్వావసు నామ సంవత్సరం త్రైత శకం 47వ సంవత్సరం తెలుగు యుగాది క్యాలెండర్లను ఆదివారం రోజున హుస్నాబాద్ లో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా తెలుగు క్యాలెండర్ ను ఆవిష్కరించారు. త్రైత సిద్ధాంత ప్రబోధా సేవ సమితి ఇందు జ్ఞాన వేదిక ఎల్కతుర్తి కమిటీ అధ్యక్షులు సదానిరంజన్ సిద్ధాంతి త్రైత సిద్ధాంత భగవద్గీత, తెలుగు ఉగాది కాల సూచిక క్యాలెండర్, త్రైత శకం 47వను పంపిణీ చేశారు. అనంతరం అధ్యక్షులు సిద్ధాంతి మాట్లాడుతూ… సనాతన ధర్మాన్ని వెలుగులోకి తీసుకురావడమే మా ఉద్దేశం ఆత్మజ్ఞానము తెలుగు పండుగల విశిష్టత మరియు తెలుగు నెలల విశిష్టత త్రైత సిద్ధాంత భగవద్గీత శ్లోకముల సారంతో పాటు ప్రతి సమస్యకు పరిష్కార మార్గాలు ఉన్న భగవద్గీత యొక్క సారాంశం ఇందులో పొందుపరాచారని తెలియ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఎంతో ఆసక్తిగా ఇలాంటి సాంప్రదాయాలు పూర్వీకుల కాలంలో ఉండేది ఈ కాల సూచికలో విషయాలను అడిగి తెలుసుకుని తెలుగు భాష కనుమరుగైపోతున్నటువంటి సమయములో స్వచ్ఛమైన త్రైత సిద్ధాంత భగవద్గీత మూడు మతాలకు ఆత్మీయతంగ అందించిన శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల స్వామివారికి ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రబోధా సేవ సమితి ఎల్కతుర్తి కమిటీ అధ్యక్షుడు సదానిరంజన్ సిద్ధాంతి, శివనారాయణ సింగ్, వెంకట్, సతీష్ చారి, రాణి, రేవతి, కల్పన, క్షేత్రజ్ఞ పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !