హుజురాబాద్/ ఏప్రిల్ 04 (మా అక్షరం):రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) నుంచి పదవీ విరమణ పొందిన కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి శుక్రవారం హుజురాబాద్ బస్ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డిపో మేనేజర్ (డిఎం) కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…పదవీ విరమణ అనంతరం రావలసిన ప్రయోజనాలు, పెన్షన్, ఇతర భత్యాల విషయాలలో ప్రభుత్వ తక్షణమే స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్టీసీ కార్మికులు రవీందర్, వేల్పుల ప్రభాకర్, సారయ్య తదితరులు పాల్గొన్నారు
Post Views: 89











