+91 99635 77856

అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం..

Kudikala Sai Editor
maaksharamnews.in

అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం..

హుజురాబాద్/ ఏప్రిల్ 06(మా అక్షరం):అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లంతకుంట శ్రీ సీతారామ కళ్యాణం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధికంగా పోటెత్తారు. ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఆయన సతీమణి శాలిని రెడ్డి కలిసి స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అనంతరం కల్యాణ దృశ్యాన్ని భక్తులతో కలిసి తిలకించారు. పండితులు శ్రీరాముని కళ్యాణ ఘట్టాన్ని పూర్తిచేసి శ్రీరాముని గొప్పతనాన్ని భక్తులకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...“శ్రీరాముడు సత్యానికి, ధర్మానికి ప్రతీక. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలి అన్నారు. తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వడంలో రాముని జీవితం మార్గదర్శకం” అని అన్నారు.అలాగే ఆలయ అభివృద్ధికి అవసరమైన సహాయాన్ని ప్రభుత్వం ద్వారా అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.భవిష్యత్తులో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి అన్ని వసతులతో తీర్చిదిద్దతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రమేలా సత్పతి, కరీంనగర్ సీపీ గౌస్ ఆలం, అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మి కిరణ్ , ఆలయ ఇంచార్జి ఈవో సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

 

Share ePaper Clip

Preparing image...

హుజురాబాద్/ ఏప్రిల్ 06(మా అక్షరం):అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లంతకుంట శ్రీ సీతారామ కళ్యాణం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధికంగా పోటెత్తారు. ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఆయన సతీమణి శాలిని రెడ్డి కలిసి స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అనంతరం కల్యాణ దృశ్యాన్ని భక్తులతో కలిసి తిలకించారు. పండితులు శ్రీరాముని కళ్యాణ ఘట్టాన్ని పూర్తిచేసి శ్రీరాముని గొప్పతనాన్ని భక్తులకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…“శ్రీరాముడు సత్యానికి, ధర్మానికి ప్రతీక. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలి అన్నారు. తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వడంలో రాముని జీవితం మార్గదర్శకం” అని అన్నారు.అలాగే ఆలయ అభివృద్ధికి అవసరమైన సహాయాన్ని ప్రభుత్వం ద్వారా అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.భవిష్యత్తులో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి అన్ని వసతులతో తీర్చిదిద్దతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రమేలా సత్పతి, కరీంనగర్ సీపీ గౌస్ ఆలం, అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మి కిరణ్ , ఆలయ ఇంచార్జి ఈవో సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !