+91 99635 77856

నివేషశ న స్థలాల ఈఎన్సి కోసం మంత్రికి వినతి…

-సానుకూలంగా స్పందించిన మంత్రి పొంగులేటి…
హుజురాబాద్/ మే 09(మా అక్షరం): హుజురాబాద్ లో జర్నలిస్టులకు కేటాయించిన నివేశన స్థలాలకు ఈఎన్ సి ఇప్పించాలని హుజురాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం శుక్రవారం అందించారు. హైదరాబాదులోని ప్రెస్ అకాడమీలో జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో హుజురాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు కాయిత రాములు, కామని రవీందర్ లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. హుజురాబాద్ లోని జర్నలిస్టులకు గత ప్రభుత్వం మంజూరు చేసిన నివేషన స్థలాలకు ఈఎంసి ఇప్పించి క్లియరెన్స్ చేయాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి జర్నలిస్టులకు పంపిణీ చేసిన నివేశన స్థలాలకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఈఎంసి ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అదేవిధంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని ఆయన చాంబర్లో కలిసి జర్నలిస్టుల స్థలాల సమస్యను పరిష్కరించాలని కోరారు .దీనికి స్పందించిన ప్రెస్ ఆకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… హుజురాబాద్ జర్నలిస్టుల నివేషన స్థలాల సమస్యను తొందరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని కలిసిన వారిలో టియు డబ్ల్యూ జె (ఐజేయు )జిల్లా అధ్యక్షులు గాండ్ల శ్రీనివాస్ ఉన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !