+91 99635 77856

పర్వీన్ సేవలు స్పూర్థిదాయకం

Kudikala Sai Editor
maaksharamnews.in

పర్వీన్ సేవలు స్పూర్థిదాయకం

- ఈ ఈ శశిభూషణ్ ...
హుజురాబాద్/ ఏప్రిల్ 30(మా అక్షరం): ఉమెన్ మజ్దూర్ పర్వీన్ సేవలు, తోటి ఉద్యోగులకు స్పూర్థిదాయకమని నీటిపారుదల శాఖ ఈఈ శశి భూషణ్ అన్నారు. గత 34 సంవత్సరాలుగా నీటిపారుదల శాఖలో ఉమెన్ మజ్దార్ గా సేవలు అందించిన పర్వీన్ బుధవారం పదవీ విరమణ పొందడంతో, సన్మాన కార్యక్రమాన్ని హుజూరాబాద్ పట్టణంలోని కేసీ క్యాంపులోని నీటి పారుదల శాఖ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పదవీ విరమణ కార్యక్రమానికి హాజరైన ఈఈ శశి భూషణ్ మాట్లాడుతూ.. పర్వీన్ అంకిత భావంతో విధులు నిర్వర్తించే వారని అన్నారు. తోటి ఉద్యోగులతో కలిసి మెలిసి ఉండేవారని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఏవో నాగయ్య, డీఈఈ వెంకట రాం ప్రసాద్, డీఈ రాము, డీఈ రవీందర్, ఏఈ సతీష్ సూపరిండెంట్, కార్యాలయ సిబ్బంది, కుటుంబ సభ్యులు, తదితరులు హాజరయ్యారు.

Share ePaper Clip

Preparing image...

– ఈ ఈ శశిభూషణ్ …

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !